మహేష్ బాబు-సిద్థార్థ్ ఫాలోవర్స్ మద్య హోరాహోరిగా వార్...
ఒక స్టార్ పాపులారిటీ ఎంతనేది కౌంట్ చేయడానికి ట్విట్టర్ ఫాలోవర్ కౌంట్ ని కొలమానంగా తీసుకుంటూ ఉండడంతో ఆయా హీరోల అభిమానులంతా తమ హీరో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడమే ఆలస్యం వెంటనే ఫాలో అయిపోతున్నారు. సౌత్ ఇండియన్ హీరోల్లో ఇంతకాలం లీడ్ లో ఉన్న మహేష్ మరోసారి సిద్దార్థ్ కంటే మెనుకబడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య 'ఫాలోవర్స్ వార్" హోరాహోరీగా చివరకు మహేష్ దే ఆధిపత్యమయింది. అయితే సిద్దార్థ్ కూడా అంతగా వెనుకబడిపోలేదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ చాప కింద నీరులా మరోసారి మహేష్ ని అధిగమించాడు. ఇది కొందరు మహేష్ అభిమానులకి రుచించడం లేదు. సిద్దార్థ్ ని ఫాలో అయ్యేవారిలో మహేష్ అభిమానులు కూడా ఉంటారు కనుక వారందరికీ అతడిని అన్ ఫాలో అవ్వండంటూ సందేశఆలు పంపుతున్నారు.
సహజంగానే ఇది సిద్దార్థ్ కి తిక్క రేపింది. అయితే వారిపై మాటల యుద్దం చేయకుండా ఆయా ట్వీట్లని రీట్వీట్ చేసి కసి తీర్చుకున్నాడు. దాంతో మహేష్ అభిమానుల పన్నాగం అందరికీ తెలిసిపోయింది. దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ 'ఒకరిని తగ్గిస్తే మన హీరో పెరగడం ఏమిటి?ఇది మూర్ఖత్వం"అన్నాడు. అలాగే మహేష్ గో క్లాష్ రాకుండా సిద్దార్థ్ తెలివిగా మణిరత్నం సినిమా చేస్తున్నందుకు అతనికి కంగ్రాట్స్ చెప్పేశాడు.
అయితే మహేష్ అభిమానులు ఇక్కడ మరిచిపోతున్న సంగతి ఒకటుంది. సిద్దార్త్ కి కేవలం సౌతిండియన్ ఫాన్స్ మాత్రమే కాక ఆలిండియా నుంచి అభిమానులున్నారు. అందుకే అతని ఫాలోవర్ కౌంట్ అంత ఉంది. కేవలం తెలుగులోనే సినిమాలు చేసిన మహేష్ కి సోలోగా నంబర్ వన్ స్థానం సుస్థిరంగానే ఉంది.ఆధిపత్యం కోసం మరో హీరోని ఫాలో అయ్యేవారిని అడ్డుకోవాల్సిన అగత్యం ఇప్పుడు ప్రిన్స్ కి లేదు. ఇది ఫ్యాన్స్ గుర్తించాలి.


Click it and Unblock the Notifications











