‘అనుష్క కెరీర్‌ను నాశనం చేసేందుకు దర్శకుడు కుట్ర’.. సెన్సేషనల్‌గా మారిన ట్వీట్
బాలీవుడ్ పరిశ్రమ విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. హిందీ సినిమా ఆధిపత్యాన్ని దక్షిణాది సినీ పరిశ్రమ సవాల్ చేస్తున్నది. డ్రగ్స్, నెపొటిజం లాంటి ఆరోపణలతో అతలాకుతలం అవుతున్నది. బ్యాన్ బాలీవుడ్ అనే వాదన సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆ వాదన మరింత పెరిగింది. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌పై మరో భారీ ఆరోపణ రావడం సంచలనం రేపింది. ఆ ఆరోపణ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌ను హిట్లతో శాసించిన కరణ్ జోహర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాను మంచి ఊపులో ఉండి సక్సెస్ సాధిస్తున్న సమయంలో ఇండస్ట్రీలో తాను ఏది చెబితే అది నడిచేలా పట్టు సాధించాడు. తనకు సానుకూలంగా లేని హీరో, హీరోయిన్లను తొక్కేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కరణ్ మౌనంగా ఉంటూనే తన పని తాను చేసుకొంటూ పోయాడు.

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కూడా తొక్కేయడానికి ప్రయత్నించాడనే వార్తలు సంచలనం రేపాయి. సుశాంత్‌కు వచ్చిన అవకాశాలను అడ్డుకొని.. తనకు సానుకూలంగా ఉండే హీరోలకు ఆ ఆఫర్లను ఇప్పించాడనే విషయం భారీ చర్చకు దారి తీసింది. సుశాంత్‌తో తీసిన ఓ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయడానికి కుట్ర చేశాడనే వార్తలపై నిరసన గళాలు వినిపించాయి.
దర్శకుడు కరణ్ జోహర్ వ్యవహార తీరుపై కంగన రనౌత్ బహిరంగంగానే తిరుగుబాటు చేసింది. తన జీవితాన్ని కూడా భ్రష్టుపట్టించే ప్రయత్నం చేశాడు. సుశాంత్ మరణానికి బాలీవుడ్ మాఫియా కారణం. తాను కూడా ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి వచ్చాను. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్ని నిలబడగలిగాను అని కంగన ఆరోపించింది. సుశాంత్ మరణం తర్వాత కరణ్ తీసిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.
ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న కరణ్ జోహర్‌పై బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అనుష్క శర్మను తొక్కేయడానికి ప్రయత్నిస్తే.. ఆమె భర్త క్రికెటర్ విరాట్ కోహ్లీని గట్టిగా సవాల్ విసిరారు. 2017లో కరణ్ జోహర్‌ను చెంప కొట్టాడు. అనుష్క శర్మ కెరీర్‌ను నాశనం చేయడం నీ అయ్యతరం కూడా కాదు అంటూ కరణ్ జోహర్‌ను హెచ్చరించాడు అంటూ ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కరణ్ జోహర్‌ను టార్గెట్ చేస్తూ క్రిటిక్ ఉమేర్ సంధూ ఇటీవల చాలా ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క శర్మ గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఉమేర్ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఉమేర్ ట్వీట్‌కు స్పందిస్తూ.. సుశాంత్ కెరీర్‌ను నాశనం చేశాడు అంటూ కొందరు కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం కరణ్‌పై నీకు అక్కసు ఎందుకు అంటూ ఎన్‌కౌంటర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











