బి-టౌన్‌లో దూరిన వసీం అక్రమ్ లవర్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ప్రియురాలు హుమైమా మాలిక్ బాలీవుడ్ టౌన్ ముంబై లో ప్రవేశించింది. ఆమె నటించిన పాకిస్థానీ సినిమా 'బోల్" ఆగస్టు 31న భారత్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనేది హుమైమా ఆలోచన. ఇందు కోసం ఇప్పటికే ముంబైకి మకాం మార్చింది. పైగా తన ప్రియుడు అక్రమ్‌కు కూడా తరచూ టచ్‌లో ఉండొచ్చనేది ఆమె ప్లాన్.
వసీమ్ అక్రమ్ ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టకు బౌలింగ్ కోచ్ గా పని చేస్తున్నాడు. మరో వైపు తన ప్రియురాలు హుమైమా మాలిక్ కూడా రావడంలో అక్రమ్‌కు బాలీవుడ్‌తో గట్టి బంధం ఏర్పడినట్లయింది.
ఇంత రంజుగా ప్రేమాయణం(డేటింగ్) సాగిస్తున్న ఈ ఇద్దరి మధ్య వయసు తేడా చూస్తే ఆశ్చర్య పడక తప్పదు. ముమైమా వయసు 20 ప్లస్ కాగా...వసీమ్ 40 ప్లస్ లో ఉన్నాడు. ఎంతైనా బౌలింగ్ తో రాటు దేలిన బాడీ కాబట్టి యవ్వనంతో నవనవలాడుతున్న తన గాళ్ ఫ్రెండ్‌ను తప్పకుండా తృప్తి పరుస్తాడనేది బి-టౌన్ గుసగుస.


Click it and Unblock the Notifications











