వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్శు సంపాదించుకోవాలి..!
ఈ మాట అన్నది ఎవరో కాదు మన అందాల అరుంధతి అనుష్క. ఇటీవల కాలంలో సూర్య సరసన సింగం అనే సినిమాలో నటించి ఈ అమ్మడుకి ఆ సినిమా హిట్ అవ్వడంతో అక్కడ బాగా మార్కెట్ పెరిగినా, తెలుగు సినిమాల పైనే తనకి మక్కువ అని చెప్పకనే చెబుతుంది. దానికి కారణం ఏమిటని అడగగా నన్ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు, అంతేకాకుండా నేను తెలుగులోనే బాగా కంఫర్ట్ గా ఉందని, ఐతే తమిళంలో కూడా అవకాశాలు వస్తే వదులుకోనే ప్రశక్తి లేదని అంటోంది.
తమిళంలో సినిమాలకన్నా, అక్కడ పలు వ్యాపారసంస్దలతో కోన్ని ఒప్పందాలు అనుష్క కి బాగా డబ్బులు సంపాదించి పెడుతున్నాయంట. చెన్నైలో షాపింగ్ మాల్స్ కి రిబ్బన్ కటింగ్స్, దుకాణాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం వల్ల ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తుందంట. అంతే కాకుండా తమిళ సినిమాల్లో రెమ్యూనిరేషన్ తక్కువైనా, ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం వల్లే ఎక్కువ డబ్బులు తీసుకుంటుందంట. మొన్న ఆ మధ్య ఓ షోరూం కి కోటి రూపాయల వరకు తీసుకున్నారని సమాచారం. దీని గురించి అనుష్క ని అడగగా మన అందాల అనుష్క వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్శు సంపాదించుకోవాలి అని అన్నారని వినికిడి. ప్రస్తుతం అనుష్క తకిట తకిట అనే సినిమాలో గెస్ట్ గా నటించారు. దానితో పాటు మహేష్ బాబు ఖలేజాలో హీరోయిన్ గా నటించారు, అనుష్క నటించిన ఖలేజా సినిమా విడుదలకు సిధ్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











