హీరోయిన్ రంభని వివాహం చేసుకోబోతోంది ఆయనే...
మొత్తానికి రంభ మ్యారేజీ కానున్నట్లు వినపడుతోంది. ఆ మేరకు ప్రయత్నాలు,సన్నాహాలు కూడా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమెను పెళ్ళి చేసుకోబోయేది ఎవరంటే..మ్యాజిక్ ఉడ్స్ అనే సంస్ధ యజమాని. రంభ రీసెంట్ గా ఆ కంపెనీకి ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆ ఓనర్ అత్యత్సాహంగా ఆమెకు బిఎండబ్లు కారుని బహుకరించాడు కూడా. ఇక వీరి వివాహం తిరుపతి లో జరగనుందని తెలుస్తోంది. అదీ డిసెంబర్ ఇరవై ఏడున అని చెప్తున్నారు. ఇక రంభ ఈ విషయమై మీడియా వద్ద నోరు విప్పటం లేదు. తమిళ మీడియా ఆమెను ఈ విషయమై కన్ఫర్మ్ న్యూస్ కోసం ట్రై చేసినా దొరకటం లేదట. అయితే ఈ వివాహ విషయం పూర్తి స్ధాయిలో పెద్దల ఒప్పందం మీదే జరగాలని నిర్ణయించుకున్నారుట. అందుకోసం ఏమన్నా ఆలస్యం అవుతుందేమోనని బయిటకు చెప్పటం లేదని అంటున్నారు. అయితే ఆమెకు దగ్గర వారు మాత్రం అటువంటిదేమీ లేదే అని వ్యాఖ్యానించటం విశేషం.కానీ గత కొద్ది రోజులుగా మాత్రం ఈ జంట మాత్రం పలు పార్టీలలో దర్శనమిచ్చిందని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











