»   » ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లు: బచ్చన్ ఫ్యామిలీ చీప్ రూమర్స్, బిగ్ బి స్పందన!

ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లు: బచ్చన్ ఫ్యామిలీ చీప్ రూమర్స్, బిగ్ బి స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియాకు చెందిన అందగత్తెల లిస్టు తయారు చేస్తే అందులో టాప్ లో ఉండే పేరు ఐశ్వర్యరాయ్. ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకోవడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేసిన ఐశ్యర్య బాలీవుడ్ సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా తన సత్తా చాటారు.

బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన ఆమె దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బాలీవుడ్ తెరపై వరుస సినిమాలతో దూసుకెలుతున్నారు. 40 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో ఐష్ ఇతర హీరోయిన్లు పోటీ ఇస్తుండటం విశేషం.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె తొలి రెండు సినిమాలు నాన్ రొమాంటిక్ నేపథ్యంతో ఎమోషనల్ సబ్జెక్టును ఎంచుకున్నారు. తాజాగా ఆమె కరణ్ జోహార్ దర్శకత్వంలో చేస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం విషయానికొస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో తరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్ తో ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లు చేసినట్లు చూపించారు.

అయితే ఐశ్వర్యరాయ్ ఇలాంటి సీన్లు చేయడంపై బచ్చన్ ఫ్యామిలీ గుర్రుగా ఉందనే రూమర్స్ బాలీవుడ్లో వినిపిస్తున్నాయి....

కోడలు అలాంటి సీన్లలో నటించడాన్ని జీర్ణించుకలేక పోతున్నారా?

కోడలు అలాంటి సీన్లలో నటించడాన్ని జీర్ణించుకలేక పోతున్నారా?

అమితాబ్ తో పాటు టోటల్ బచ్చన్ ఫ్యామిలీ ఇటీవల విడుదలైన యే దిల్ హై ముష్కిల్ టీజర్లో ఐష్ ను అలాంటి సీన్లలో చూసి ఇబ్బంది పడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకంటే చిన్నవాడైన రణబీర్ తో ఐష్ అలాంటి హాట్ సీన్లు చేయడం ఏమిటంటూ ఫ్యామిలీ మొత్తం గుర్రుగా ఉందనే ప్రచారం బాలీవుడ్ సర్కిల్ లో జరుగుతోంది.

అప్పుడే అనుమానం

అప్పుడే అనుమానం

ఇలాంటి సీన్లు చేయాల్సి వస్తుందని ఐశ్వర్యరాయ్‌కి స్క్రిప్టు నేరేషన్ సయమంలోనే చెప్పారట. ఆ సయమంలోనే ఇలాంటి సీన్లు చేయాలా? వద్దా? అనే కన్ ఫ్యూజన్ ఐశ్వర్యరాయ్ వ్యక్తం చేసారని, ఏదైనా అభ్యంతరాలు వస్తాయని అనుమాన పడుతూనే ఓకే చెప్పిందని టాక్.

బిగ్ బి సమాధానం చూసి అంతా షాక్

బిగ్ బి సమాధానం చూసి అంతా షాక్

బయట ఇంత ప్రచారం జరుగుతుంటే... బిగ్ బి మాత్రం అందరూ ఆశ్చర్య పడేలా స్పందించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆయన ఇప్పటి వరకు ‘యే దిల్ హై ముష్కిల్' టీజర్ తాను ఇప్పటి వరకు చూడలేదంటూ సమాధానం ఇచ్చారు.

బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు

బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు

బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్ చేసిన హాట్ సీన్లపై గుర్రుగా ఉందనే వార్తలను బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు ఖండిస్తున్నారు. ఫ్యామిలీ లో ఉన్నవారంతా ప్రొఫెషనల్ యాక్టర్లే. ఇలాంటి సీన్లు చూసి వారు ఎందుకు ఇబ్బంది పడతారు. అదంతా సినిమా మాత్రమే. రియల్ కాదు కదా.... ఇలాంటి రూమర్స్ ఎవరూ పుట్టిస్తారో అర్థం కాదు. ఆ సీన్లు చూసి బచ్చన్ ఫ్యామిలీ ఇబ్బంది పడటం లాంటిదేమీ లేదు అని స్పష్టం చేస్తున్నారు.

ఐశ్వర్యరాయ్ మీద ఎలాంటి ఆంక్షలు లేవు

ఐశ్వర్యరాయ్ మీద ఎలాంటి ఆంక్షలు లేవు

ఐశ్వర్యరాయ్ ప్రొఫెషనల్ యాక్టర్. ఎన్నో సినిమాల్లో చేసారు. ప్రస్తుతం ఆమె తన వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె వర్కులో ఎవరూ వేలు పెట్టారు. ఆమె ఇలాంటి సినిమాలు మాత్రమే చేయాలి, ఇలాంటి సీన్లు చేయకూడదను అనే ఆంక్షలు ఏమీ లేవు. స్వతంత్రంగా ఆమె తన చేసే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది అని బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.

ఐష్-రణబీర్ చాక్లెట్ లికింగ్ సీన్

ఐష్-రణబీర్ చాక్లెట్ లికింగ్ సీన్

సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే సీన్లు యమ హాటుగా ఉండబోతున్నాయని, ఓ సీన్లో ఒకరి బాడీ మీద ఉండే చాక్లెట్ మరొకరు తమ నాలుకతో లిక్ చేసే సీన్ ఉందని టాక్. అయితే టీజర్లో మాత్రం ఆ సీన్ చూపలేదు. సినిమాలో ఉంటుందట.

ఐశ్వర్యరాయ్ లిప్ లాక్ సీన్ రిజక్ట్ చేసిందా?

ఐశ్వర్యరాయ్ లిప్ లాక్ సీన్ రిజక్ట్ చేసిందా?

స్క్రిప్టు ప్రకారం దర్శకుడు కరణ్ జోహార్ ఐశ్వర్యరాయ్-రణబీర్ కపూర్ మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా ప్లాన్ చేసారట. అయితే ఈ ప్రతిపాదనను ఐశ్వర్యరాయ్ తిరస్కరించారని సమాచారం. అందుకే సినిమాలో అలాంటి సీన్లు ఉండవట. అప్పట్లో ఐశ్వర్యరాయ్, హృతిక్ రోషన్ మధ్య ధూమ్ 3 సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండటం, ఐశ్వర్యరాయ్ పెళ్లి సమయంలో ఈ సినిమా రావడంతో అప్పట్లో బచ్చన్ ఫ్యామిలీ ఆ సీన్ మీద అభ్యంతరం చెప్పిందనే రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

దర్శకుడు ఏం చేసాడంటే...

దర్శకుడు ఏం చేసాడంటే...

ఐశ్వర్యరాయ్ లిప్ లాక్ సీన్ కు నో చెప్పడంతో.... దర్శకుడు కరణ్ జోహార్ ఇద్దరి మధ్య ముద్దు సీన్లు ఉన్నట్లు కొన్ని ఫేక్ కిస్ సీన్లు షూట్ చేసారు. అంటే ఈ సీన్లలో ఇద్దరి పెదాలు కలిసినట్లు కనిపించక పోయినా... ఇద్దరూ ముద్దు పెట్టుకున్నట్లు ప్రేక్షకలు అనుభూతికి లోనవుతారన్నమాట. టీజర్లో ఈ సీన్ ఉంది.

అందుకే అందరికీ అనుమానం

అందుకే అందరికీ అనుమానం

సెకండ్ ఇన్నింగ్స్ లో ఐశ్వర్యరాయ్ జజ్బా, సరబ్జీత్ సినిమాలు చేసారు. ఈ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను, ట్రైలర్లను ఆమె భర్త అభిషేక్, మామ అమితాబ్ తమ తమ సోషల్ మీడియా పేజీల ద్వారా షేర్ చేసారు. అయితే ఆమె తాజా సినిమా ‘యే దిల్ హై ముష్కిల్' విషయంలో మాత్రం అలాంటిదేమీ చేయలేదు. దీంతో ఈ సినిమా హాట్ సీన్లపై ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది.

మీరు నిజంగా నమ్ముతున్నారా?

మీరు నిజంగా నమ్ముతున్నారా?

ఐశ్వర్య రాయ్ ఇలాంటి సీన్లు చేయడంపై బచ్చన్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందనే వార్తలను మీరు నమ్ముతారా? మీ కామెంట్స్ ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

యేదిల్ హై ముష్కిల్ టీజర్ ఇదే

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దీప్తి నావల్, లీసా హెడెన్, ఫవాద్ ఖాన్, ఇమ్రాన్ అబ్బాస్, షారుక్ ఖాన్ గెస్ట్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాలో హైలెట్ కానున్నాయి.

English summary
One of the most gorgeous women on the Earth, Aishwarya Rai Bachchan is in tremendous buzz owing to her sensuous avatar in her upcoming film, Ae Dil Hai Mushkil! One side, people are going gaga over Aishwarya's stunning look while on the other side, rumours are rife that her family is not really happy with her bold avatar! Finally, during the promotion of his upcoming film, Pink, Amitabh Bachchan told Pinkvilla that he has not watched the teaser of his bahu's film, Ae Dil Hai Mushkil teaser yet. Well, that's weird!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu