For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరి నరేష్ ...'మామ మంచు...' కథ ఇదే

  By Srikanya
  |

  హైదరాబాద్ : మోహన్‌బాబు, అల్లరి నరేశ్‌, రమ్యకృష్ణ, మీన, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మామ మంచు అల్లుడు కంచు'. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 25న 'మామ మంచు అల్లుడు కంచు' ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పదేళ్ల క్రిందట వచ్చిన మరాఠి లో వచ్చిన Be Dune Saade Chaar - 2009 రీమేక్ అని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకోబడుతున్న కథ ని మీ ముందు ఉంచుతున్నాం..నిజమో కాదో ...ధియోటర్ లో తేల్చుకోండి.

  ఈ చిత్రం కథ అల్లరి మొగుడు కి కంటిన్యూగా మొదలవుతుంది. మీనా, రమ్యకృష్ణలను వివాహం చేసుకున్న భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు)..ఒకరికి తెలియకుండా మరొకరితో మ్యానేజ్ చేస్తూంటాడు. ఇలా నడుస్తూంటే మీనా వల్ల కూతురు (పూర్ణ), రమ్యకృష్ణ వల్ల (వరుణ్ సందేష్) కొడుకు పుడతారు. వరుణ్ సందేశ్, పూర్ణ ప్రేమలో పడటంతో వీరిని విడకొట్టడానికి అల్లరి నరేష్ ని ఆశ్రయిస్తాడు మోహన్ బాబు.

  అల్లరిన నరేష్ .. అక్కడ నుంచి పూర్ణని ప్రేమలో పడేయటానికి ప్రయత్నిస్తూంటాడు. అంతేకాకుండా మోహన్ బాబు ఇద్దరి పెళ్లాల లొసుగు గమనించి ఎడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నిస్తూంటాడు. సినిమా చివరకి వచ్చేసరికి అసలు నిజం బయిటకు వచ్చి అల్లరి నరేష్, వరుణ్ సందేష్ ఒకే మ్యారేజ్ హాల్ లో వివాహం తో క్లైమాక్స్ ఉంటుంది. నరేష్...అక్కడ మీనా, రమ్యకృష్ణలిద్దరుని కూడా కన్వీన్స్ చేసి నిజం బయిటపెడతారు. ఈ చిత్రం పూర్తి కామెడీతో నడుస్తుంది.

   What about Maama Manchu Alludu Kanchu ?

  విడుదల తేదీ దగ్గర పడుతూండటంతో ఈ చిత్రం కొత్త ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

  మోహన్‌బాబు మాట్లాడుతూ ''శ్రీనివాసరెడ్డి మంచి దర్శకుడు. ఒక కథ అతని చేతికిస్తే అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కిస్తాడు. ఇలాంటి దర్శకుడు మరిన్ని సినిమాలు చేయాలి. ఒక్క నిమిషమూ వృథా చేయకుండా పనిచేశాం.'అల్లరి మొగుడు' లాంటి సినిమాలో నటించడం తన అదృష్టం అని చెబుతుంటుంది రమ్యకృష్ణ.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కానీ ఆ సినిమాలో నేను నటించడం నా అదృష్టమేమో. రమ్యకృష్ణ వల్లే ఆ సినిమా బాగా ఆడిందేమో. అప్పట్లో ఎవరైతే కాదన్నారో వాళ్లే ఇప్పుడు రమ్యకృష్ణ డేట్ల కోసం వెంటపడుతున్నారు. మీనా, రమ్యకృష్ణతో చాలా కాలం తర్వాత నటించా. వాళ్లిద్దరూ నాకు బంగారం. ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలు రెండు మూడు సంవత్సరాలకే తిరిగి వెళ్లిపోతున్నారు. మీనా, రమ్యకృష్ణ ఇప్పటికీ అలాగే ఉన్నారు.

   What about Maama Manchu Alludu Kanchu ?

  'మామ మంచు...'లో నటించిన అల్లరి నరేష్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈవీవీ సత్యనారాయణ అంటే నాకు ఇష్టం. అతనితో రెండు సినిమాలు చేశాను. చాలామంది హాస్యనటుల్ని ఆయన పైకి తీసుకొచ్చారు. వాళ్లబ్బాయి నరేష్‌ 50 సినిమాలు చేశాడు. తను సమయానికి సెట్‌కు రాడు.. ఎందుకొచ్చిన గొడవ అన్నారు చాలామంది. నరేష్‌ మాత్రం ఎప్పుడడిగితే అప్పుడొచ్చాడు.

  {video2}

  నటుడిగా నేను 500 సినిమాలు చేశా. నరేష్‌ నా కంటే ఎక్కువ సినిమాలు చేయాలి. విష్ణు, మనోజ్‌లా నరేష్‌ కూడా నా కొడుకులాంటివాడే. ఏ సన్నివేశంలోనూ నన్ను డామినేట్‌ చేయలేదు. సినిమా చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది''అన్నారు.

  డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను ఇతర తారాగణంగా నటించారు.

  ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

  English summary
  Mohan Babu,Allari Naresh's multi starrer Maama Manchu Alludu Kanchu directed by Sreenivas Reddy is offering X Mas treat on Dec 25.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X