మహేష్ బాబు రెమ్యునేషన్ ఎంత?
దూకుడు, బిజినెస్ మ్యాన్ వరస విజయాలతో మహేష్ ఇప్పుడు హాట్ స్టార్ గా మారారు. దాంతో ఇప్పుడాయిన రెమ్యునేషన్ కూడా బాగా పెరిగిందని అంతర్గత వర్గాల సమాచారం. సినిమాకు తొమ్మిది కోట్లు రెమ్యునేషన్ అని,ఓవర్ సీస్ రైట్స్ లో పిప్టీ పర్శంట్ షేర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ సీస్ మార్కెట్ లో ఇప్పుడు మహేష్ నెంబర్ వన్ గా ఉన్నారు. నైజాం షేర్ తో సమానంగా ఓవర్ సీస్ లో కూడా వసూళ్లు వస్తున్నాయి. ఇక మహేష్ మీద ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలంతా ఆసక్తి చూపిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ బిజినెస్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.
మహేష్ బాబు డేట్స్ ఉంటే చాలు ఫైనాన్సియర్స్ ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో ప్రతీ ఒక్క నిర్మత తమదైన శైలిలో మహేష్ ని పట్టుకోవటానికి డైరక్టర్స్ ద్వారా కాంబినేషన్స్ సెట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మహేష్ కూడా వరసగా సినిమాలు ఒప్పుకోవటంతో వారిని ఉత్సాహపరుస్తోంది. గతంలోలాగ మూడేళ్లు పాటు సినిమాలు చెయ్యకండా మహేష్ తన తండ్రి కృష్ణగారిలా వరస సినిమాలతో ముందుకెళ్లటంతో అందరూ మహేష్ డేట్స్ కోసమే ట్రై చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ తన రేటుని ఇంకా పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











