సిద్దార్ధ 'ఓ మై ప్రెండ్' టాక్ ఏంటి?
సిద్దార్ధ, శృతి హాసన్ కాంబినేషన్ లో వేణు శ్రీరామ్ అనే దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందిన ఓ మై ప్రెండ్ ఈ రోజే(శుక్రవారం)విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షో లకు హాజరైన వారి టాక్ ప్రకారం కథ ఇద్దరు మిత్రులు, వసంతం, జానే తూ యా జానే నా వంటి చిత్రాల షేడ్స్ ఉన్నా కొత్త ట్రీట్ మెంట్ తో దర్శకుడు రూపొందించాడు. ఇక సినిమా స్లో పేస్ లో ప్రారంభమైనా సెకండ్ సాంగ్ వచ్చేసరికి అందుకుంది. ఇంటర్వెల్ లో కొత్త ట్విస్టు కాకపోయినా ప్రేక్షకుడు తృప్తితో బయిటకు వచ్చేలాగ డిజైన్ చేసారు. ఫస్టాఫ్ డీసెంట్ గా నడిచిన ఈ చిత్రం శృతి హాసన్ చెప్పే నువ్వు ఓ పవన్ కళ్యాణ్, అది ఒక భూమిక.. మీ లవ్ స్టోరీ ఒక ఖుషీ వంటి డైలాగులతో ఊపు అందుకుంటుంది. తెలుగు నటులపై ఆలీ చేసే స్పూఫ్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.
సెకెండాఫ్ లో కాస్త డ్రాగ్ అయినట్లు అనిపించినా ఎమోషనల్ సీన్స్ కి బాగా కనెక్టు అవుతారు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మెలోడ్రామా పాళ్లు కాస్త ఎక్కువ అయ్యీయంటున్నారు. చివరి అరగంటే సినిమాకి కీలకం కానుంది. అలాగే బాగా క్లాస్ గా మల్టి ప్లెక్స్ లను ఉద్దేశించినట్లు తీసినట్లుంది, మాస్ కి ఎక్కటం కాస్త కష్టమని చెప్తున్నారు. అయితే సిద్దార్ద, శృతి హాసన్ ల మధ్య రిలేషన్ షిప్ ని బాగా డవలప్ చెయ్యటంతో దర్శకుడు విజయం సాధించాడు. దిల్ రాజు తనదైన నిర్మాణ విలువలు టేస్ట్ తో చేయించుకున్న పాటలు మేజర్ ప్లస్ అవుతున్నాయి. శృతి హాసన్ కూడా చాలా బాగా ఫెరఫార్మెన్స్ చేసిందని వినపడుతోంది. సిద్దార్ద కూడా చాలా కాలం తర్వాత తనదైన శైలిలో ఎమోషన్స్ ని పండించాడని అంటున్నారు. డైలాగులుకు మంచి రెస్పాన్స్ వస్తుందని, ఎమోషన్స్ బాగా పట్టుకున్నారని అంటున్నారు. మణిశర్మ బిజిమ్, రీ రికార్డింగ్ ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి, అదే సినిమాకి హైలెట్ కానుంది. ఇక సినిమాటోగ్రఫి ఎక్సలెంట్ గా ఉంది.
ఫైనల్ గా సినిమాలో క్లైమాక్స్ వద్ద వచ్చే చివరి అరగంట ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సినిమా ఫలితాన్ని నిర్ణయించే అవకాసం ఉంది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారికి నచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఇలాంటి కొత్త తరహా రొమాంటిక్ లవ్ స్టోరీ తో వచ్చిన వేణు శ్రీరామ్ మాత్రం దర్శకుడుగా మంచి మార్కులు వేయించుకుంటాడని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











