రాజమౌళి 'ఈగ'బడ్జెట్ అంతా?

By Srikanya

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ఈగ బడ్జెట్ ముప్పై కోట్లు దాటిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చాలా చిన్న బడ్జెట్ అనుకుని నాని వంటి చిన్న హీరోతో ప్రారంభించిన ఈ చిత్రం అనుకోని విధంగా గ్రాఫిక్స్ హంగామాతో ఈ రేంజి బడ్జెట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే రాజమౌళి కి ఉన్న బిజినెస్ స్టామినాని బట్టి ఈ మొత్తం పెద్దది కాదని,సినిమాపై ఉన్న భారీ అంచనాలు,మిగతా భాషల్లోకి వెళ్లే అవకాసం ఇవన్నీ బడ్జెట్ కు సహకరించే అంశాలు అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.

ఇక 'ఈగ' చిత్రం యుఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దాదాపు రెండు కోట్ల వరకూ పలికినట్లు సమాచారం. ఈ చిత్రం క్రేజ్ చాలా ఉండటంతో మార్కెట్లో మంచి పోటీ ఏర్పడి ఈ రేటు కి వెళ్లిందంటున్నారు. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X