రాజమౌళి 'మర్యాదరామన్న' కి లీగల్ గా ట్విస్ట్?
రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మర్యాదరామన్న' చిత్రం రిలీజ్ కు త్వరలో లీగల్ తలనొప్పుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని వినపడుతోంది. రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఆ రకంగా లీగల్ ప్రసీడింగ్స్ ని వేగవంతం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక అప్పట్లో రాజమౌళి తన వద్ద అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయలేదంటూ చంటి అడ్డాల నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే నిర్మాతల మండలి వారు కూడా వెంటనే స్పందించి ఈ విషయం తేలేవరకూ రాజమౌళిపై నిషేధం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. పెద్ద దర్శకుడు కావటంతో ఎవరూ ఆయన్ని ఏమీ అనలేకపోయారని, పెద్ద పెద్ద నిర్మాతలు అతని అండ ఉన్నప్పుడు ఏం చేయగలమని అప్పుడు చెప్పుకున్నారు. ఆ స్ధితిలో చంటి అడ్డాల తన వద్ద తీసుకున్న ఐదు లక్షలు అడ్వాన్స్ కు రాజమౌళి సినిమా డైరక్ట్ చేసి పెట్టాలని డిమాండ్ చేసారు. అలాకాని పక్షంలో తన ఇచ్చిన మొత్తానికి వడ్డీ వేసి పాతిక లక్షలు ఇమ్మని డిమాండ్ చేసారని చెప్పుకున్నారు.
అయితే రాజమౌళి ఆ మొత్తానికి మూడు రూపాయల వడ్డీతో అతనికి చెక్కులు ఇచ్చారు. కానీ చంటి అడ్డాల మాత్రం రాజమౌళి తన చిత్రాన్ని డైరర్ట్ చేస్తానని డబ్బు తీసుకున్నారు కాబట్టి ఆ మాట ప్రకారం తన చిత్రానికి డైరక్ట్ చేయాలని పట్టుపడుతున్నారని వినికిడి. రాజమౌళి కి అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేయటం వల్ల తాను చాలా నష్టపోయానని, పలువురుకు రాజమౌళితో సినిమా అని చెప్పుకున్నానని ఆ సమస్యకు పరష్కారం రాజమౌళి తనతో సినిమా చేయటమే నంటున్నాడు. అందుకే ముందుగా రాజమౌళి చేస్తున్న చిత్రం'మర్యాదరామన్న' కు లీగల్ గా ట్విస్ట్ ఇచ్చి ఆపి తన సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











