అసలు రామ్ గోపాల్ వర్మకీ, చిరంజీవికి మధ్య గొడవేంటి?
రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ లో తాను మెగాస్టార్ చిరంజీవితో చిత్రం చేయటానికి ఉవ్విళ్ళూరుతున్నానని, దొర-ద లార్డ్ అనే టైటిల్ అనుకుంటున్నానని అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం రెస్పాన్స్ లేదుకానీ, చిరంజీవికీ, రామ్ గోపాల్ వర్మ మధ్య చెడటానికి గల కారణాలు మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వారివురి మధ్య తగువు రావటానికి కారణం సంజయ్ దత్. సంజయ్ దత్ తో రామ్ గోపాల్ వర్మ అప్పట్లో గాయం చిత్రాన్ని నాయక్ పేరుతో రీమేక్ చేద్దామని సంకల్పించి ప్రారంబించారు. అయితే అనుకోని విధంగా ఎకె 47 దొరికిన కేసులో సంజయ్ దత్ జైలుకు వెళ్లిపోయారు. దాంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఇది గమనించిన వర్మ..హైదరాబాద్ వచ్చి..అశ్వనీదత్ కి సబ్జెక్టు చెప్పి సినిమా ప్రారంభించారు. అందులో ఊర్మిళ హీరోయిన్. కర్ణాటక లోని చిక్ మంగుళూర్ లో రెండు పాటలు తీసారు. ఈ లోగా సంజయ్ దత్ జైలునుంచి బెయిల్ మీద బయిటకు వచ్చారని న్యూస్ వచ్చింది. అంతే రామ్ గోపాల్ వర్మ చెప్పాపెట్టకుండా అక్కడికి చెక్కేసి దౌడ్ సినిమా ప్రారంబించారు. దాంతో అశ్వనీదత్, చిరంజీవిలకు అవమానమైపోయింది. దాంతో చిరంజీవితో అప్పటిదాకా ఉన్న రిలేషన్ మొత్తం చెడిపోయింది. ఆ తర్వాత ఆ చిత్రం కోసం చిత్రీకరించిన పాటలను గుణశేఖర్ దర్సకత్వంలో రూపొందిన చూడాలని ఉంది చిత్రంలో కలిపారు...అదీ సంగతి.


Click it and Unblock the Notifications











