ఎన్టీఆర్ మాటలకు సుమ ఏడ్చిందా.. రాజీవ్ కనకాల నుంచి హీరోకు ఫోన్ కాల్.. తరువాత ఏం జరిగింది?

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ సుమపై చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఆ రేంజ్ లో స్టేజ్ పైన సీరియస్ అయిన సందర్భాలు లేవు. అయితే ఆ విధంగా సీరియస్ అయిన తర్వాత సుమ ఏడ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రాజీవ్ కనకాల కూడా ఎన్టీఆర్ కు ఫోన్ కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అప్డేట్ విషయంలో..

అప్డేట్ విషయంలో..

ఆదివారం జరిగిన అమీగోస్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గానే కొనసాగింది. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన విధానం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫ్రెండ్స్ అందరికి కూడా ఆరోజు ఎన్టీఆర్ క్లాస్ తీసుకున్నాడు. సినిమా అప్డేట్ల గురించి ఒత్తిడి పెంచకూడదు అని తప్పకుండా మా భార్యల కంటే ముందు సరైన సమయంలో మీకు అప్డేట్ ఇస్తామని ఎన్టీఆర్ చాలా వివరంగా తెలియజేశాడు.

సుమపై ఎన్టీఆర్ కోపం

సుమపై ఎన్టీఆర్ కోపం

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా సీరియస్ అవ్వడానికి కారణం కూడా సుమ అని తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి పెద్దగా వివరణ ఇవ్వాలని అనుకోలేదట. సినిమా కాబట్టి దాని గురించి ఎక్కువ స్థాయిలో మాట్లాడాలని అనుకున్నారు. కానీ సుమ ఊహించిన విధంగా ఎన్టీఆర్ అప్డేట్ కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అని మైక్ ఇచ్చే ముందు మాట్లాడడంతో ఎన్టీఆర్ చాలా సీరియస్ అయిపోయాడు.

వాళ్లు అడక్కపోయినా..

వాళ్లు అడక్కపోయినా..

జూనియర్ ఎన్టీఆర్ సుమ వైపే చూస్తూ చాలా సీరియస్ గా కనిపించాడు. వాళ్లు అడక్కపోయినా నువ్వు చెప్పేసేలా ఉన్నావు.. అంటూ ఎన్టీఆర్ చాలా సీరియస్ గా మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కళ్యాణ్ రామ్ మొదట జూనియర్ ఎన్టీఆర్ ను కూల్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం సుమా మాట్లాడిన విధానంపై మాత్రం చాలా ఘాటుగా రియాక్షన్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సుమ ఏడ్చిందా?

సుమ ఏడ్చిందా?

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా కౌంటర్ ఇవ్వడంతో స్టేజిపైనే సుమ మళ్లీ మరొక మాట కూడా మాట్లాడలేకపోయింది. ఇక ఆమె జూనియర్ ఎన్టీఆర్ మాటలకు చాలావరకు అప్సెట్ అయినట్లు ఏడ్చినట్లు కూడా టాక్ వస్తోంది. తప్పకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తారేమో అనుకొని సుమా తొందరపడిన విధానం మాత్రం ఎన్టీఆర్ కోపం తెప్పించినట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

రాజీవ్ కనకాలతో బాండింగ్

రాజీవ్ కనకాలతో బాండింగ్

సుమకు అలాగే ఎన్టీఆర్ కు మధ్య ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్ బాండింగ్ అయితే ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్, సుమా భర్త రాజీవ్ కనకాల సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో మంచి స్నేహితులుగా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా రాజీవ్ కనకాలపై తరచుగా సెటైర్స్ వేయడమే కాకుండా సుమ పై కూడా జోకుల పేలుస్తూ ఉంటాడు. చాలా ఫ్రెండ్లీ వాతావరణం వీరి మధ్యలో కొనసాగుతోంది.

ఎన్టీఆర్ కు ఫోన్ కాల్?

ఎన్టీఆర్ కు ఫోన్ కాల్?

అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ప్రత్యేకంగా రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ కాల్ కూడా చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ కూడా ఆ విషయాన్ని మళ్లీ పెద్దగా పట్టించుకోలేదు అని తొందరపాటులో అలా జరిగిపోయి ఉంది అని వివరణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సుమ కూడా ఆ విషయంలో పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మళ్ళీ ఇంటర్వ్యూలో సుమ ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X