Pushpa 2 : 2000 కోట్ల దిశగా పుష్ప 2 .. అల్లు అర్జున్‌కి ఊహించని షాక్, అక్కడ షోలు రద్దు?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొడుతోంది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. స్త్రీ 2, కల్కి 2, జవాన్ వంటి చిత్రాలు వసూళ్లు చేసిన మొత్తాలను కేవలం రెండు వారాల్లో అధిగమించి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. పుష్ప 2 జోరు చూస్తుంటే రూ.2000 కోట్లను క్రాస్ చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు అమీర్ ఖాన్ నటించిన దంగల్ (రూ.2,024 కోట్లు), ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి 2 ఉన్నాయి. పుష్ప 2 జోరు చూస్తుంటే ఆ రికార్డులను కొట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో వసూళ్లు కాస్త నెమ్మదించినా హిందీ బెల్ట్‌లో మాత్రం పుష్ప రాజ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు.

ఈ వీకెండ్‌కు తోడు త్వరలో క్రిస్మస్ సెలవులు ప్రారంభం కావడంతో మరో వారం పాటు పుష్ప 2 టాప్ ట్రెండింగ్‌లో ఉండే అవకాశాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే హాలీవుడ్ చిత్రం ముఫాసా ది లైన్ కింగ్ వంటి సినిమాల ప్రభావం స్వల్పంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓ సినిమా మాత్రం పుష్ప 2ను కంగారు పెడుతోంది. అదేదో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బేబీ జాన్ రూపంలో పుష్ప 2కి అడ్డంకి ఎదురుకానుందని వార్తలు వస్తున్నాయి.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీకి హిందీ రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆల్రెడీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ఓ రేంజ్‌లో నిర్వహిస్తోంది. వరుణ్ ధావన్‌కు హిందీ బెల్ట్‌లోనూ, ముఖ్యంగా యువతో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. అన్నట్లు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కీర్తి సురేష్‌కు బేబీ జాన్ తొలి హిందీ చిత్రం. తన బాలీవుడ్ డెబ్యూ ఓ రేంజ్‌లో ఆడాలని ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది.

పుష్ప 2 రూ.2000 కోట్ల టార్గెట్‌ను చేరుకునే దిశలో బేబీ జాన్ నుంచి ఈ సినిమాకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్టిప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్.. ఉత్తరాదిలో పుష్ప 2 షోలను రద్దు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బేబీ జాన్‌ను డిసెంబర్ 25న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. దీంతో పుష్ప 2ను 50-50 విధానంలో ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్ కోరడంతో వివాదం రాజుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నిర్మాతలు రంగంలోకి దిగి విషయం సెటిల్ చేయడంతో చాలా చోట్ల షోలు ప్రారంభమైనట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి.
మరో వెర్షన్ ప్రకారం .. పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ వల్ల నార్త్ ఇండియాలోని థియేటర్‌లలో ఈ సినిమాను పీవీఆర్ ఐనాక్స్‌లు నిలిపివేసినట్లుగా వార్తలు వచ్చాయి. తర్వాత పుష్ప మేకర్స్ వివాదాన్ని పరిష్కరించినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. మరి ఇందులో నిజమేంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











