twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు చేతులు పిసుక్కుంటున్నాడట... మంచి లాభం మిస్సయ్యాడా?

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇష్మార్ట్ శంకర్'. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. జులై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఇటు చిత్ర బృందంతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషంగా ఉన్నారు.

    ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లోనే సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పాయింటును దాటేసి లాభాల బాటలోకి వెళ్లింది. ఈ మూవీ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

    దిల్ రాజు చేతులు పిసుక్కుంటున్నాడట!

    దిల్ రాజు చేతులు పిసుక్కుంటున్నాడట!

    ‘ఇస్మార్ట్ శంకర్' చిత్రాన్ని కొనుగోలు చేయడానికి అప్పట్లో దిల్ రాజు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని నిర్మాతలు పూరి జగన్నాధ్, చార్మి అఫీషియల్‌గా వెల్లడించారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాపై నమ్మకం లేక బరి నుంచి తప్పుకున్నారు. మినిమమ్ ప్రాఫిట్స్‌కు సినిమాను అమ్ముతామని వారు చెప్పినా ఈ బడా ప్రొడ్యూసర్ ఎందుకో సాహసించలేకపోయాడు. అయితే ఇపుడు అదే మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతూ అదరగొడుతుండటంతో అనవసరంగా సినిమాను వదులుకున్నానే అంటూ రిగ్రెట్ ఫీలవుతూ... చేతులు పిసుక్కుంటున్నాడట.

    దిల్ రాజు వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి?

    దిల్ రాజు వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి?

    ‘ఇస్మార్ట్ శంకర్' సినిమాను వదులుకోవడానికి అప్పట్లో దిల్ రాజును చాలా విషయాలు ప్రభావితం చేశాయనే ప్రచారం జరిగింది. ఇటు పూరి ప్లాపుల్లో ఉండటం, అటు రామ్ గ్రాఫ్ కూడా ఏమంత బాగోలేక పోవడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు టాక్.

    అపుడు దెబ్బతిన్నాడు కాబట్టే...

    అపుడు దెబ్బతిన్నాడు కాబట్టే...

    ఒక సినిమా విజయాన్ని అంచనా వేయడంలో దిల్ రాజు ఎక్స్ పర్ట్ అని చెబుతుంటారు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్' విషయంలో రాజుగారి అంచనాలు తలక్రిందులు అయ్యాయి. ఇంతకు ముందు పూరి దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా' చిత్రాన్ని కొన్న దిల్ రాజు భారీగా నష్టపోయాడు. దిల్ రాజు వెనక్కి తగ్గడానికి ఇది కూడా ఓ కారణం అయుండొచ్చు.

    ఇస్మార్ట్ శంకర్

    ఇస్మార్ట్ శంకర్

    ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 14.90 కోట్లకు అమ్మారు. 5 రోజుల్లో 22.40 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో ఇప్పటికే మూడున్నకోట్లకుపైగా లాభం వచ్చింది. సినిమా బిజినెస్ పూర్తయ్యే సమయానికి అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు చూడటం ఖాయం అంటున్నారు.

    English summary
    Is Dil Raju feels Regrets about Ismart Shankar? He was initially interested in buying the film. But later changed his decision. Now the film makes good profits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X