రామ్ చరణ్ 'రచ్చ'పూర్తి కథ ఇదే
రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రం కథలో తమన్నా,ఆమె కుటుంబం ఇంట్రడక్షన్ తో ప్రారంభమవుతుంది. వారితో పాటే ముఖేష్ రుషి అతని కుమారుడు రంగం పేమ్ అజ్మల్ రివిల్ అవుతారు. పార్తీపన్ ..హీరో రామ్ చరణ్ తండ్రి. ముగ్గురు స్నేహితులు(ముఖేష్ రుషి,పార్దీపన్,మరొకరు)వేరు వేరు దేశాల నుంచి తమ గ్రామాన్ని డవలప్ చేయటానికి ఫండ్స్ పోగుచేస్తారు. అయితే దుర్మార్గుడైన ముఖేష్ రుషి ఆ ఇద్దరిని చంపేసి ఆ డబ్బుతో పరారవుతాడు. అప్పుడు రామ్ చరణ్ తన తండ్రి కోరిక నెరవేర్చటానికి ముఖేష్ రుషి కోసం వెతుకుతూంటాడు. మరోప్రక్క తమన్నా ఎప్పుడూ వేరే ఆలోచనలో ఉంటూంటుంది. ఇక్కడ ఓ ట్విస్టు .
ముఖేష్ రుషి కొడుకు అజ్మల్ తమన్నాని ప్రేమిస్తాడు. అంతేకాక ఆమెను దక్కించుకోవటానికి ఆమె కుటుంబాన్ని లేపేస్తాడు. ఇప్పుడు తమన్నా తన పగ తీర్చటానికి కావాల్సిన మనిషి కోసం వెతుకుతోంది. ఆ ప్రాసస్ లో ఆమెకు రామ్ చరణ్ కరెక్టు మనిషిని తేలుతుంది. దాంతో అతన్ని ప్రేమించటానికి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఆమె చరణ్ ని ఓ మనిషిని చంపాలి...అంటే చరణ్ ఒప్పుకోడు.కానీ చరణ్ కి తర్వాత తెలిసేదేమిటంటే...అజ్మల్ ఎవరో కాదు తన తండ్రిని చంపిన ముఖేష్ రుషి కొడుకు అని. అప్పుడు ఆమె రిక్వెస్ట్ ని మన్నించి అతన్ని వెతకటం మొదలెట్టి మొత్తానికి పట్టుకుంటాడు.చివరకు ముఖేష్ రుషి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని తన గ్రామానికి వినియోగిస్తాడు.
అయితే ఈ కథంతా పైన చెప్పినట్లుగా కాకుండా స్క్రీన్ ప్లే తో సాగుతుంది. సినిమా ప్రారంభం విలేజ్ ఎపిసోడ్...బాంబ్ బ్లాస్ట్ సీన్ ఉంటుంది. రామ్ చరణ్ ఎంట్రన్స్ ట్రైన్ ఎపిసోడ్,ఒక ట్రైన్ మీద నుంచి మరో ట్రైన్ మీదకు దూకటం,ట్రైన్ ట్రాక్ లో కార్ రేస్ తో ఇరగతీస్తాడు. ఫైట్ తర్వాత రచ్చ టైటిల్ సాంగ్ మొదలవుతుంది. మావాడు వచ్చింది రికార్డులు బ్రద్దలు కొట్టడానికేరా వంటి డైలాగులు,పంచ్ లతో స్పీడుగా కథనం నడుస్తుంది. ఇక రామ్ చరణ్ పెంచిన తండ్రి ఎమ్.ఎస్ నారాయణ. అతనికి లివర్ ప్లాబ్లం. ఇరవై లక్షలు అవసరం. అప్పుడు మొదట ఓడిపోయినవాడు ఓ పందెం కాస్తాడు. హీరోయిన్ తమన్నాను ప్రేమలో పడేస్తే ఆ డబ్బు ఇస్తానని...దానికి చరణ్ ఓకే అంటాడు. ఆమె తండ్రి పెద్ద రౌడి.
ఆ తర్వాత చరణ్ మెడికోగా ఆ డ్రెస్ లో ఆమెని పడేయాటికి వేసే ట్రిక్స్..చివరకు ఆమె పడిపోవటం...ఇంటర్వెల్ దగ్గర అస్సలు ఆమె పడిపోవటానికి కారణం..ఆమె తండ్రి సొంత తండ్రికాదని రివిల్. తర్వాత ఆమె కోరిన కోరిక..దాన్ని పైన చెప్పినట్లు చరణ్ మీదేసుకుని తీర్చడంతో ముగుస్తుంది. ఇక ఈ కథని ఎంత అద్బుతంగా దర్శకుడు ఒప్పించాడు అనేది తెరపై చూడాల్సిందే. ఫ్యాన్స్ కి పండగ లాంటి ఈ చిత్రం ఖచ్చితంగా రికార్డులు బ్రద్దలు కొడుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











