twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : మహేష్ బాబు హీరోయిన్ రెమ్యునేషన్

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ ఏమిటీ అంటే సోనాక్షి సిన్హా. ముఖ్యంగా ఆమెకు అనుకుంటున్న రెమ్యునేషన్ తెలుగు సిని వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దబాంగ్‌ భామ సోనాక్షి సిన్హా తెలుగులో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమాకు ఆ అమ్మడు పుచ్చుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా! అక్షరాలా ఐదుకోట్ల రూపాయలు.

    ముంబాయికి చెందిన ఓ టాబ్లాయిడ్‌ పత్రిక ఈ సమాచారాన్ని బయటపెట్టింది. డేట్‌లు లేకపోయినా, స్క్రిప్టు నచ్చడం, అదీ కథాంశం చరిత్రాత్మకం కావడంతో సోనాక్షి ఈ సినిమాను అంగీకరించినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. మహేష్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నట్లు సోనాక్షి ఇటీవల ట్విటర్‌లో తెలిపిన విషయం తెలిపిందే. గమ్యం, వేదం సినిమాల దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    సోనాక్షిని క్రిష్‌ ఒప్పించాడని ముంబాయి పత్రిక పేర్కొంది. అతను ఇంతకుముందుకూడా ఆమెను తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నించినా, అప్పుడు సోనాక్షి ఒప్పుకోలేదు. అయితే, మహేష్‌ సినిమాకోసం క్రిష్‌ ఈ సారి పట్టువదలకుండా ప్రభుదేవా ద్వారా ప్రయత్నించడంతో అమ్మడు ఒప్పుకుందని పత్రిక కథనం. ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షి సిన్హా రౌడీ రాథోడ్‌(విక్రమార్కుడు రీమేక్‌)లో నటించిన సంగతి తెలిసిందే.

    మహేష్ త్వరలో చేయబోయే శివం చిత్రం 1950లో జరుగుతుంది. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షినే తీసుకోవాలని ప్రత్యేకంగా అనుకోవటానికి కారణం చెప్తూ ఈ విషయం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా 1950లో జరుగుతుంది. ఈ కథలో హీరోయిన్ పాత్ర సినిమాకు చాలా కీలకం. ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్ర రాసుకుంటూంటే నా మనస్సులో సోనాక్షినే మెదిలింది. సినిమా లో ఆమెపాత్ర పేరు మీనాక్షి అన్నారు.

    అలాగే సోనాక్షి అందంగా ఉండటమే కాక అందమైన కళ్లు ఉండాలి. నేను దబాంగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని పవర్ ఉంది. ఆ కళ్లు చాలా ఎక్సప్రెసివ్ గా ఉంటాయి అంటూ ఆయన వివరించారు. ఈ సంవత్స రం లోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం అశ్వనీదత్ నిర్మించనున్నారు. సుకుమార్ చిత్రం షూటింగ్ పూర్తవగానే ఈ చిత్రం పూర్తవుతుంది. క్రిష్ చిత్రం పూర్తయ్యాక శ్రీనువైట్లతో చేసే ఆగడు ప్రారంభమవుతుంది.

    English summary
    When the makers of Telugu movie Shivam approached her, she liked the script of the film and gave her consent to star alongside Mahesh Babu in it. But the actress reportedly quoted Rs 5 crore as her remuneration. Since she had lot of demand in the B-Town, the producer are said to have agreed to pay her this hefty amount.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X