రక్త చరిత్రలో...సూర్య పాత్ర క్లైమాక్స్ లోనే !?
తమిళ రక్త చరిత్రకూ, తెలుగు రక్త చరిత్రకూ తేడా ఉందంటున్నారు రామ్ గోపాల్ వర్మ. రక్త చరిత్ర తెలుగులో రెండు వెర్షన్ లుగా విడుదల అవుతుంది. మొదటి వెర్షన్ లో వివేక్ ఒబరాయ్ పాత్రకు(పరిటాల రవి) పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం క్లైమాక్స్ పది నిముషాల ముందు మాత్రమే సూర్య(మద్దెల చెరువు సూరి) పాత్ర వస్తుంది. ఇక రక్త చరిత్ర చిత్రం రెండో పార్ట్ లో వివేక్ కీ సూర్యకి మధ్య జరిగే సంఘటనలో సినిమా నడుస్తుంది. అదే తమిళ వెర్షన్ కి వచ్చేసరికి సూర్య పాత్ర మొదటి ముప్పై ఐదు నిముషాలకే వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఆ పాత్ర డామినేషన్ గా కథ నడుస్తుంది. అలాగే రక్త చరిత్ర బాగా వయలెన్స్ కూడిన చిత్రం అదే సమయంలో ఇది బాగా ఎమోషనల్ గా ఉండబోతోంది. అయితే వయెలెన్స్ కూడా ఓ హ్యూమన్ ఎమోషన్ అని గుర్తుంచుకోవాలి అన్నారు.
సూర్య రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ ప్రియమణి వివేక్ ఒబరాయ్ రాధా ఆప్టే surya rakta charitra ram gopal varma priyamani vivek oberoi


Click it and Unblock the Notifications