రజనీ ద్వారా షారుఖ్ కాసుల వేట!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై రూపొందుతున్న సినిమా రా.వన్. ఇందులో షారుఖ్ హీరో కాగా, అతని భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్ లలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన కరీనా నటిస్తోంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. రజినీతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయించడానికి చాలా పెద్ద కారణమే ఉందట. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్ లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడి జనాలను రా.వన్ సినిమా వైపు ఆకర్షించడానికే ఇలా రజనీతో ఈ పాత్ర చేస్తున్నాడట షారుఖ్. తనను చూడటానికి కాకపోయినా రజనీకాంత్ ను చూడటానికైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, తద్వారా కలెక్షన్లు పెంచుకోవచ్చనేది కింగ్ ఖాన్ మాస్టర్ ప్లాన్ అని బాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











