అక్కినేని-దాసరి శతృత్వం వెనక కారణం?
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుతో పాటు దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రముఖులు. గత కొన్నేళ్లుగా పరిస్థితి గమనిస్తే...ఈ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన విబేధాలు రోజురోజుకీ ముదిరి ఇద్దరి మధ్య దూరం బాగానే పెంచాయి. అందుకే తెలుగు సిరీ పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా....ఒకరు హాజరైతే, మరొకరు హాజరు కారు.
పరిస్థితి ఏ రేంజ్ లో ఉందంటే ....ఇటీవల దాసరి నారాయణ రావు సతీమణి పద్మ మరణించినా అక్కినినితో పాటు ఆయన వారసులెవరూ పరామర్శకు రాలేదు. కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేదట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరి మధ్య విబేధాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో.
ఈ పరిస్థితికి కారణం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గతంలో వచ్చిన విబేధాలే అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఆ మధ్య అన్నపూర్ణ స్టూడియోలో దాసరి స్వీయ నిర్మాణంలో ఓ సినిమా తీశారని, స్టూడియో రెంటు, ప్రొడక్షన్ పరికరాకు సంబంధించిన డబ్బు దాసరి చెల్లించలేదని, ఈ విషయంలో వచ్చిన గొడవ ముదిరి పెద్దదయిందని అంటున్నారు.
దాసరి విషయంలోనే కాదు....గతంలో గంటసాల, సావిత్రి, శోభన్ బాబులు మరణించినప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖలంతా వారి చివరి చూపుకు తరలి వెళ్లగా, అక్కినేని మాత్రం అటు వైపు చూడలేదు. మరి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడం అక్కినేనికి ఇష్టం లేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











