Pushpa 2 the rule : పుష్ప 2 రన్ టైమ్ ఎన్ని గంటలో తెలుసా? .. ఓపిక ఉండాల్సిందే!

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. పాట్నాలో ట్రైలర్ లాంచ్, చెన్నైలో కిస్సిక్ సాంగ్ స్పెషల్ ఈవెంట్‌లు జరగ్గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అన్ని రకాల అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి పుష్ప 2 షూటింగ్ ప్యాచ్ వర్క్ సహా మొత్తం పూర్తి చేసుకుంది. హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ వర్క్‌ను ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసింది. కేరళ, ముంబైలలో భారీ ఈవెంట్స్‌కి ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ .. హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

what is the runtime of allu arjun sukumar s pushpa 2 the rule

పాట్నాలో రిలీజ్ చేసిన పుష్ప 2 ట్రైలర్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తుండగా.. హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఓవర్సీస్‌లో ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 4వ తేదీనే పుష్ప 2 సందడి మొదలుకానుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు ఉండనున్నాయి. పుష్ప 2 హైప్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా.. సినిమా సెన్సార్‌కు వెళ్లడానికి ముందే పుష్ప 2లోని ప్రముఖుల కోసం స్పెషల్ షో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ షోకు అల్లు అర్జున్, సుకుమార్, అల్లు అరవింద్ సహా పుష్ప 2కు వర్క్ చేసిన కొందరు టాప్ టెక్నీషియన్స్ హాజరైనట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. సినిమా చూసిన తర్వాత యూనిట్ మొత్తం ఎగ్జయిటింగ్‌కు గురైందని.. మూవీ చాలా బాగా వచ్చిందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవాళ రాత్రికి కానీ, రేపు ఉదయానికి కానీ పుష్ప 2 సెన్సార్ రివ్యూని పూర్తి చేసుకోనుందని టాక్. అయితే సినిమా నిడివి ఎంత ఉండొచ్చు? పార్ట్ 1 మాదిరిగానే ఉంటుందా? అంటూ నెటిజన్లు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో చర్చించుకుంటున్నారు. పుష్ప పార్ట్ 1 దాదాపు 2 గంటల 59 నిమిషాల పాటు రన్ అవ్వగా.. సెకండ్ పార్ట్ అంతకు మించి అనేలా నిడివి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి పుష్ప 2 ది రూల్ ఏకంగా 3 గంటల 21 నిమిషాల పాటు ఉండనుందట.

what is the runtime of allu arjun sukumar s pushpa 2 the rule

ఇంత నిడివి ఉండటం మామూలు విషయం కాదు. అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టడం కూడా చాలా కష్టం. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే రన్ టైమ్ అన్న విషయాన్ని ప్రేక్షకుడు పట్టించుకోడని ఎన్నో సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది. గతేడాది రిలీజైన యానిమల్ దాదాపు మూడున్నర గంటల పాటు నడిచినా సంచలన విజయం సాధించిన విషయాన్ని అల్లు ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X