సదాను తాకిన ఆ 'వేడి' వస్తువేమిటి?
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సదా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సరైన హిట్లు లేక సతమతమౌతోంది. అపరిచితుడు సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు నిరాశపరచడంతో సరైన అవకాశాలు లేక తెరమరుగైన సదా ఇతర భాషాచిత్రాతో బిజీగా వున్నానంటూ చెప్పుకొచ్చింది.
తెలుగు తెరపై మరోసారి అ.ఆ.ఇ.ఈ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇందులో శ్రీకాంత్ కథానాయకుడు. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ విడియో యూ-ట్యూబ్ లో దర్శనమిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇందులో ఆశ్యర్యపడాల్సిందేముందీ ఈ మధ్య విడుదలకు ముందే సినిమా క్లిప్పిగ్స్ లీక్ అవ్వడం కామనేగా అనుకుంటున్నారా....అయితే మీరు పప్పులో కాలేసినట్టే....
ఈ విడియో సినిమా పాటో లేక సన్నివేశమో కాదు...షూటింగ్ సమయంలో తీసినది. ఇందులో సదా ఓ పాట చిత్రీకరన జరుగుతుండగా ఉన్నట్టుండి భోరున ఏడవడం మొదలెట్టింది. దీనికి కారణం వేడిగావున్న వస్తువు తనని తాకడంవల్ల అని కొందరు, పాట చిత్రీకరన ఇబ్బందికరంగా వుండటం వల్ల అని కొందరు చెప్పుకొంటున్నారు. అసలు వషయం సదాకే తెలియాలి.


Click it and Unblock the Notifications











