సంజన-భరత్ మధ్య ‘సం’బంధం?
ఎప్పుడూ ఎవరో ఒకరితో ఎఫైర్ కొనసాగిస్తూ వార్తల్లో ఉండే హీరోయిన్ సంజన మరోసారి వార్తల్లో కెక్కింది. ప్రేమిస్తే సినిమా హీరో భరత్ తో కొంత కాలంగా స్నేహం కొనసాగిస్తున్న సంజన అతనితో ప్రేమలో పడిందని, ఇటీవల వాలంటైన్స్ డే రోజు ఇద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈవెంట్‌లో ఇద్దరూ చాలా దగ్గరయ్యారని, ఆ క్రమంలోనే ఇద్దరి బంధం బలపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య బుజ్జిగాడు, దుశ్శాసనతో పాటు పలు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ కన్నడ భామ సినిమాల్లోకి వచ్చి దాదాపు ఆరేళ్లయింది. అన్ని దక్షిణాది భాషల్లోనూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. చిన్న చిన్న పాత్రలే తప్ప సంజన ఇప్పటి వరకు హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది. బాయ్స్ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చిన భరత్ 'ప్రేమిస్తే' సినిమా ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ హీరోగా సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అడపా దడపా సినిమాలు చేస్తున్న పెద్దగా ఫలితం లేకుండా పోతోంది.


Click it and Unblock the Notifications











