»   » సెట్టింగ్స్ హైప్ మొత్తం హర్రర్ కామెడీ టైపా?? కాష్మోరా పై ఈ టాక్ నిజమైతే మాత్రం పెద్ద దెబ్బ పడ్దట్టే

సెట్టింగ్స్ హైప్ మొత్తం హర్రర్ కామెడీ టైపా?? కాష్మోరా పై ఈ టాక్ నిజమైతే మాత్రం పెద్ద దెబ్బ పడ్దట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో భారీతనం అంటే ఏంటో ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలకూ చూపించింది 'బాహుబలి' సినిమా. సెట్టింగ్స్ చూసుకున్నా.. గ్రాఫిక్స్ పరిశీలించినా.. ఇంకా ఏ రకంగా చూసినా భారీతనం విషయంలో 'బాహుబలి' అగ్ర భాగాన నిలుస్తుంది. దీని తర్వాత వచ్చినా.. రాబోయే భారీ సినిమాలన్నీ కూడా సెట్టింగ్స్.. గ్రాఫిక్స్ విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. 'బాహుబలి'తో పోల్చదగ్గ.. దానికి దీటైన సినిమాగా కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్న 'కాష్మోరా' కూడా చాలా విషయాల్లో ఉన్నత ప్రమాణాలతోనే తెరకెక్కింది అని చెప్పిన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ తన వ్యాక్యలతో మరో భారీ సినిమాని చూడబోతున్నాం అనే ఆసక్తిని కలిగించాడు..

దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ప్రభంజనం 'బాహుబలి' ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన విషయం తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, భారీ సెట్టింగ్స్ పరంగా, యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించడం పరంగా ఇలా ఎలా చూసినా బాహుబలి స్థాయి వేరు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన కాష్మోరా అనే సినిమాలో కూడా కొద్దిభాగం యుద్ధ నేపథ్యంలో, ఓ సైనికాధికారి చుట్టూ కథ నడుస్తుంది. దీంతో తమిళనాట సాధారణంగానే 'బాహుబలి' సినిమాతో 'కాష్మోరా'ను పోల్చి చూడడం కనిపిస్తోంది.

What You Can Expect From Kashmora is may wrong

అయితే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న రిపోర్ట్స్‌ బట్టి 'కాష్మోరా'లో ఆ పీరియడ్‌ సెటప్‌ కేవలం అరగంట మాత్రమే ఉంటుందని తెలిసింది. మిగతా సినిమా అంతా సగటు హారర్‌ కామెడీ మాదిరిగానే సాగుతుందట. ఆ అరగంటలోనే అంచనాలకి తగినంత ఎక్సయిట్‌మెంట్‌ అందిస్తే ఓకే కానీ లేదంటే ఇప్పుడు ఏర్పడ్డ అంచనాలకి ఈ కాష్మోరా తీవ్రంగా నిరాదరణకి గురయ్యే అవకాశాలున్నాయి.

హైప్‌ కోసం రాంగ్‌ ప్యాకేజింగ్‌ చేసిన చాలా చిత్రాలకి అలాంటి అనుభవాలే ఎదురైన నేపథ్యంలో విడుదలకి రెండు రోజులు ముందయినా తిమ్మిని బమ్మిని చేసి చూపించకుండా వున్నది వున్నట్టు చూపించడానికి నిర్మాతలు పూనుకోవాలి. లేదంటే రీసెంట్‌గానే కబాలి చిత్రానికి ఎలా చుక్కెదురైందో చూసాం కదా. మరి ఇప్పుడు కాష్మోరా పరిస్థితి కూడా అదే అవనుందా..? అనే ప్రశ్న మొలకెత్తుతోంది. కేవలం ఇలా హైప్ తోనే ఓపెనింగ్స్ రాబట్టుకోవచ్చేమో గానీ సినిమాని నిలబెట్టటం మాత్రం కష్టమే మరి కాష్మోరా టీం ఎలా ఆలోచిస్తోందో కానీ ఒక వేళ ఈ టాక్ గనక నిజమే అయితే మాత్రం కార్తీ కష్టం మొత్తం వృధా అయిపోయినట్టే..

English summary
Kaashmora is an upcoming horror film starring Karthi, Nayanthara and Sri Divya. an interesting Buzz about Kashmora is The old part with a warrior getup ios like a horror comedy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu