twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్ కలయిక మతలబు ఏంటీ.. ఏం ఉడుకుతున్నదబ్బా..

    నందమూరి, నారా కుటుంబాలకు సంబంధించి ఓ అరుదైన కలయిక ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గతంలో బహిరంగ వేదికల మీద పెద్దగా కలుసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నారా రోహిత్‌ ఇటీవల జరిగిన ఓ పార్టీలో చాలా క్లోజ్

    By Rajababu
    |

    నందమూరి, నారా కుటుంబాలకు సంబంధించి ఓ అరుదైన కలయిక ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గతంలో బహిరంగ వేదికల మీద పెద్దగా కలుసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నారా రోహిత్‌ ఇటీవల జరిగిన ఓ పార్టీలో చాలా క్లోజ్ మూవ్ అవ్వడం అనేక చర్చలకు దారి తీస్తున్నది.

    Whats cooking behind Junior NTR, Nara Rohit Party meet

    ఓ నిర్మాత కూతురుకు సంబంధించిన వేడుకు హాజరైన అతిథుల జాబితాలో ఎన్టీఆర్, నారా రోహిత్ ఫ్యామిలీ అన్యోన్యంగా ఉన్నట్టు ఫోటో స్పష్టమైంది.

    తెలుగు దేశం పార్టీకి దూరంగా

    తెలుగు దేశం పార్టీకి దూరంగా

    ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి నందమూరి కుటుంబంలో చాలా మంది దూరంగా ఉంటున్నారు. టీడీపీ కార్యక్రమాలకు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు హరికృష్ణ కూడా హాజరవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు సోదరుడు నారా రాంమ్మూర్తినాయుడుకి పెద్దగా పాత్ర కనిపించడం లేదు. రాంమూర్తినాయుడిని పూర్తిగా పక్కన పట్టినట్టే కనిపిస్తున్నది. చంద్రబాబు, రాంమూర్తి నాయుడు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. బయటకు చెప్పుకునే అంతగా లేదని ఆ ప్రాంత నేతల వాదన.

    గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు

    గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు

    గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టడానికి నారా రోహిత్‌కు చంద్రబాబు సపోర్ట్‌గా నిలిచారనే ఫిలింనగర్ టాక్. ఆ తర్వాత రోహిత్‌కు అదే మద్దతు కొనసాగినట్టు కనిపించిన పరిస్థితి లేదు. చంద్రబాబు తీరుపై రాంమూర్తి నాయుడు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గతంలో మీడియాలో బహిరంగంగానే చంద్రబాబుపై రాంమూర్తినాయుడు విమర్శలు కూడా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు దెబ్బకు రాంమూర్తినాయుడు రాజకీయాల్లో క్రియాశీలక తప్పుకునేంత పరిస్థితి ఎదురైంది.

    ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను

    ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను

    రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ పూర్తిగా పక్కన పెట్టింది. యంగ్ టైగర్‌ను పక్కన పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పెద్ద పీట వేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మద్దతు కోరడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌, హరికృష్ణ కుటుంబాలు టీడీపీకి దూరంగానే ఉంటున్నాయి.

    నారా, నందమూరి కుటుంబాల

    నారా, నందమూరి కుటుంబాల

    టీడీపీకి దూరంగా ఉంటున్న నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వారసులు తాజా పార్టీలో క్లోజ్‌గా కనిపించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎప్పడూ ప్రైవేట్ పార్టీలకు దూరంగా ఉండే జూనియర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఈ పార్టీలో కీలకంగా మారిందనే ఇన్‌సైట్ టాక్. ఈ పార్టీకి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి, నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంక దత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితరులు హాజరయ్యారు.

    అనేక ప్రశ్నలు

    అనేక ప్రశ్నలు

    ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నందమూరి తారకరామరావు పేరిట పార్టీ రిజిస్టర్ చేసినట్టు కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాడనే వార్తల్లో ఎంత నిజముందో చెప్పలేం గానీ.. ఆ వార్తలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు సయోధ్య జరుగుతున్నదా? ఇలా రకరకాల ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు. తాజా విందు వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్ కలయిక ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నదని చర్చనీయాంశమైంది.

    English summary
    NTR is seen partying with his cousin Nara Rohit. Apparently, NTR has attended the birthday party of a producer's daughter recently which also saw the attendance of many other film personalities and friends including Nara Rohit. The duo seems to have share good bond and camaraderie. They were spotted hanging out close during the party, divulged the insiders who attended the party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X