త్రివిక్రమ్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు టాప్ హీరోలు.. గురూజీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకులకి ప్రస్తుతం యువ దర్శకులు కూడా చాలా టఫ్ కాంపిటేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మన దగ్గర ఉన్న టాప్ స్టార్ దర్శకుల్లో ఒకో దర్శకుడు తమ సినిమాలతో లోకల్ నుంచి నేషనల్ లెవెల్లోకి మారిపోయారు. కాగా మన హీరోస్ లో టాప్ 5 ఎవరెవరు అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఎలా వినిపిస్తారో అలాగే మన టాలీవుడ్ టాప్ స్టార్ దర్శకులు అంటే మొదటిగా వినిపించే మూడు పేర్లలో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సుకుమార్ మరియు త్రివిక్రమ్ ల పేర్లు వినిపించడం జరుగుతుంది.

కాగా ఈ టాప్ 3 లో ఇద్దరు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నారు కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వలేదు. కాగా ఆ ఇద్దరు టాప్ మోస్ట్ దర్శకులకి లేని కొన్ని నెగిటివ్ అంశాలు మాత్రం త్రివిక్రమ్ కి ఇపుడు మరింత కొనసాగుతున్నాయి. ఒకప్పుడు త్రివిక్రమ్ అంటే మంచి మాటలు అలాగే ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు అన్నట్టుగా ఉండేది కానీ తనపై ఎప్పుడైతే కాపీ ఎలిమెంట్స్ ఎక్కువయ్యాయో అక్కడ నుంచి తన డౌన్ ఫాల్ ఆడియెన్స్ లో మొదలైంది.

Trivikram Srinivas

కాగా ఎలాగో సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూడో సినిమా గుంటూరు కారం చేసేసుకున్నారు కానీ ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ ని గట్టిగా నమ్మే స్టార్ హీరోలు ఇపుడు కరువైనట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. నిజానికి త్రివిక్రమ్ ఇపుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ భారీ చిత్రం చేయాల్సి ఉంది కానీ ఇది ఊహించని విధంగా ఆగిపోయింది.

దీని ప్లేస్ లో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లైమ్ లైట్ లోకి వచ్చింది కానీ ఈ తర్వాత అయినా త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా అంటే టాలీవుడ్ వర్గాల్లో ఆ చప్పుడు లేదు. సరే ఇది పక్కన పెడితే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఎపుడు నుంచో సినిమా చేయాల్సి ఉంది. అరవింద సమేత తర్వాత అనౌన్స్ అయ్యి కూడా సినిమా ఇప్పుడు వరకు ఎటు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి.

కాగా ఇపుడు ఎన్టీఆర్ తో అయినా ఆ సినిమా మొదలవుతుందా అంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని అసలు పట్టించేకోవట్లేదని తెలుస్తుంది. కాగా ఇపుడు ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్ కేవలం వార్ 2 సహా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు పైనే పెట్టాడట. పోనీ వీటి తర్వాత అయినా త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తారా అంటే వెంటనే తారక్ దేవర 2 కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.

దీనితో త్రివిక్రమ్ ని మాత్రం మన స్టార్ హీరోలు అంతగా నమ్మడం లేదనే చెప్పి తీరాలి. ఇంకోపక్క త్రివిక్రమ్ మరో నిర్మాతలతో కూడా సినిమాలు చేయకపోతుండడంతో అసలు త్రివిక్రమ్ కి సినిమాలు ఎవరూ ఇవ్వడం లేదా లేక తన దగ్గర స్ట్రైట్ సబ్జెక్టులు లేవా అనే అనుమానాలు కూడా ఇపుడు పెరుగుతున్నాయి.

Take a Poll

More from Filmibeat

Read more about: trivikram allu arjun jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X