కత్రినా ఆఫర్‌ను ఐశ్వర్యరాయ్ కొట్టేసిందా?

By Bojja Kumar

ముంబై : అందాలతార ఐశ్వర్య రాయ్ తన బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా సరే ఐశ్వర్యరాయ్ స్టార్‌డమ్, ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. ఈ కారణంగానే కత్రినా కైఫ్‌కు రావాల్సిన ఆఫర్ ఐశ్వర్యరాయ్‌కి వచ్చినట్లు బాలీవుడ్ టాక్.

ముంబై సెంట్రల్లో 17.5 ఎకరాల్లో ప్రారంభమైన 'ది పార్క్' అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఆ సంస్థ ప్రతినిధులు కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెను సంప్రదించారట....ఆ తర్వాత కత్రినాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఐశ్వర్య రాయ్‌తో డీల్ ఓకే చేసుకున్నారట.

ఈ వ్యవహారంపై కత్రినా చాలా అప్‌సెట్ అయిందని, కంపనీ ప్రతినిధులు అన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని మండి పడుతోందట. ఈ వ్యవహారం వెనక చాలా పాలిటిక్స్ నడిచాయని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం ఆమెకు అలాంటి అవసరం లేదని, ఆమె స్టార్ డమ్ వల్లనే ఆ సంస్థ ఐష్‌తో డీల్ ఓకే చేసుకుందని అంటున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....ఇదే కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ముంబై వర్లీ ప్రాజెక్టులో ఐశ్వర్యరాయ్ రూ. 5 కోట్ల విలువ చేసే 4 పడకల ఫ్లాట్ కొన్నారని....అందువల్లే ఐశ్వర్యరాయ్‌ని సదరు కంపెనీ 'ది పార్క్' ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుందనే ప్రచారం కూడా సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X