నేనూ సెక్సీ పోజింగ్కు రెడీ...!

By Staff

Bhoomika
అంటున్నది మరెవరో కాదు భూమిక. ఆమె మొదటి నుంచీ ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకునో మరెందుకో గానీ ఎక్స్ పోజింక్ కి దూరంగా ఉంటూ వచ్చింది. 'యువకుడు' తో పరిచయమైన ఈ పంజాబీ భామ 'ఖుషీ' వంటి సూపర్ హిట్స్ లో నటించి గబగబా ఎదిగి పోయింది. అలాగే 'మిస్సమ్మ' వంటి సినిమాల్లో హుందాతనం చూపే పాత్రను అవలీలగా చేసేసింది. అలాగే ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఆఫర్లు తగ్గుతాయేమోనని అనుకున్నారందరూ.

కానీ చిత్రంగా ఆమెకు అవకాశాలు వరసగా వస్తూనే వున్నాయి. అయితే తన తోటి హీరోయిన్లు ముఖ్యంగా ఛార్మీ వంటి వారు తెరపై పూర్తి స్ధాయిలో అందాలు పరుస్తూ ముందుకు దూసుకుపోవటంతో ఆమెకీ బెంగపట్టుకుందిట. ఎంతకాలముంటుందో తెలియని గ్లామర్ ని నమ్ముకుని దాచటం అనవసరం అని ఫీలవుతోందిట. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన 'అనసూయ' క్రెడిట్ మొత్తం దర్శకుడు రవిబాబు కే వెళ్ళిపోయింది. 'మల్లెపూవు' హిట్టయినా 'సత్యభామ' లానే మిగిలుపోతుంది గానీ కెరీర్ కి పెద్దగా ఉపయోగపడదని అంటున్నారుట.

అంతేగాక పలువురి నిర్మాతలు కోరిన మీదట ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎక్స్‌పోజింగ్ బెట్టును భూమిక కాస్త సడలించుకున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఆమె 'వారణం అయిరం' అనే తమిళ చిత్రంలో సెక్సీ పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. దీంతో తెలుగు నిర్మాతలు కూడా ముందుకువచ్చి ఆమెతో ఎక్స్‌పోజింగ్ చేయించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో భూమిక నటించనుంది. ఇక తన సెకెండ్ ఇన్నింగ్స్ లో భూమిక ఏపాటి సెక్సీగా వుంటుందో చూడాలి మరి అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X