క్రేజీ స్టార్ రవితేజ కన్నీరు పెట్టిన వేళ..
తెరపై తన కొంటె వేషాలతో నవ్వులు పూయించే రవితేజ వ్యక్తిగతంగా చాలా సెన్సిటివ్ అనీ,ముక్కుసూటి మనిషి అని తెలిసున్న వాళ్ళు చెప్తూంటారు. తాజాగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న శంభో శివ శంభో అనే తమిళ రీమేక్ చిత్రం సెట్ లో ఆయన కన్నీరు పెట్టి అది నిజమేనని రుజువు చేసారు. తమిళంలో చేసిన అభినయ అనే ఈ అమ్మాయి ఈ రీమేక్ లోనూ చేస్తోంది. ఆ అమ్మాయి మాగ,చెముడు ఉన్న అమ్మాయి. అయితే నటనలో ఆమె అద్భుతం చేస్తుందని నాడోడిగల్ చిత్రం ప్రూవ్ చేసింది. అందులోనూ ఆ చిత్రం దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని సైతం డైరక్ట్ చేయటంతో ఆ పాత్రకు ఆమెనే తీసుకున్నాడు. ఇక ఆమెకు ప్రత్యేకంగా లిప్ సింక్ అయ్యేలా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. సెట్లో ఆమె ప్రవర్తన, టాలెంట్ చూసిన హీరో రవితేజ ఆమె ఫ్యాన్ అయిపోయారు. అందులోనూ ఆమె టేక్ ఒన్ లోనే ప్రతీ షాట్ ఓకే చేసేస్తోంది.దాంతో ఆమె మాట్లాడలేదు, వినలేదన్న వాస్తవానికి ఆయన చలించిపోయారు. అప్రయత్నంగానే ఆయనకు కన్నీరు వచ్చింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











