For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్చ్... శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఒక్కో సినిమా పెట్టిన ముహూర్తమో..మరొకటో... సినిమా పూర్తైనా విడుదల కాదు.. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. చివరకు ..అంతా ఆ విషయమే మర్చిపోయే పరిస్ధితి వస్తుంది. అలాంటివి ఎక్కువగా కొత్తగా లాంచ్ అయ్యే హీరోలు చిత్రాలకు జరుగుతూంటుంది. అలాంటిదే 'ఇంటింటా అన్నమయ్య' ప్రముఖ దర్సకుడు రాఘవేంద్రరావు డైరక్షన్ లో రూపొంది విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రం ఇంటింట అన్నమయ్య ఫైనాన్సియల్ సమస్యలతో ఆగిపోయింది.

  షూటింగ్ పూర్తై చాలా కాలం అయినా ఈ చిత్రం రిలీజ్ కు నోచుకోవటం లేదు.దాంతో ఈ చిత్రానికి పబ్లిసిటీ సైతం ఆపు చేసేసారు. 'శ్రీరామరాజ్యం' ర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రం పై చాలా అంచనాలే ఉన్నాయి. అయితే ఫైనాన్సియల్ సమస్యలతో చిత్రం ఆగిపోయిందని వినికిడి.

  Where is Intinta Annamayya?

  'ఇంటింటా అన్నమయ్య' ద్వారా రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. ఆ యువకుడికి పాశ్చాత్య సంగీతమంటే మహా ప్రీతి. ర్యాప్‌, పాప్‌... అంటూ గిటారుపట్టుకొని ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే అన్నమయ్య కీర్తనలు విన్నాక మన సంగీతంలోని గొప్పదనాన్నీ, ఆయన రచనలోని వైశిష్ట్యాన్నీ తెలుసుకొన్నాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీదే చూడమంటున్నారు రాఘవేంద్రరావు.

  హీరో రేవంత్ చిత్ర విశేషా లను వివరిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేయడానికి నిర్మించిన చిత్రం 'ఇంటింటా అన్నమయ్య' అని ఈ చిత్రంలో ప్రధానపాత్రలో తాను నటించడం ఆనందంగా వుందని, కీరవాణి అందించిన గీతాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందరి అభిరుచులను దృష్టిలో వుంచుకొని పాటలను సంప్రదాయ గీతాలుగా, చందమామ పాటలుగా, రాక్ సాంగ్స్‌గా రూపొందించారని, సంగీత సాహిత్య విలువలుగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుందని, ప్రతి ఇంటా అన్నమయ్య పాటలు సంకీర్తన చేయాలని ఆయన వివరించారు.

  నిర్మాత మాట్లాడుతూ ''అన్నమయ్య గీతాలకీ ఓ యువకుడి జీవితానికీ ఉన్న బంధమే ఈ కథ. అదేమిటో తెర మీదే చూడాలి. నవతరానికి తెలుగుదనాన్నీ, సంప్రదాయాల్నీ చెప్పేలా ఉంటుంది. రాఘవేంద్రరావు కథను ఆవిష్కరించిన తీరు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి'' అన్నారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ఏవీయస్, జయప్రకాష్‌రెడ్డి, సుబ్బరాయశర్మ, భూషణ్, సుధ, హేమ, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సాయిబాబా మూవీస్ యూనిట్, మాటలు: ఉమర్‌జీ అనురాధ, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: యలమంచిలి సాయిబాబు, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

  English summary
  “Intinta Annamayya” was supposed be directed by Raghavendra rao. Apparently, sources say that the movie is not releasing as of now because of Financial Problems, as the producers of the movie have to pay 10 crores to a prominent Lab.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X