సినిమా రిలీజయ్యాక.. పాప కనిపించదేం?
హైదరాబాద్: సాధారణంగా సినిమా రిలీజయ్యాక చిత్రం క్రూ, దర్శకుడు, హీరోయిన్, హారో మొత్తం ఛానెల్స్ ముందు కూర్చుని ఊదరకొడ్తూ ఉంటారు. అయితే రిలీజ్ కు ముందు అంత కాదు...ఇంత కాదు అని చెప్పిన ఆమె రిలీజ్ తర్వాత కనపడలేదు అంటే ఆశ్చర్యమే. ఆమె ఎవరో కాదు తేజస్విని. అయితే రిలీజైన నాటి నుంచి ఆమె ప్రమోషన్ కి దూరంగా ఉంటోంది. రిలీజ్ కు ముందు చిత్రం ప్రమోషన్ తో ఊదరకొట్టిన ఈ పాప తర్వాత కనపకపోవటంతో అందరూ అదే హాట్ టాపిక్ గా మాట్టాడుకుంటున్నారు
ఇప్పుడు తెలుగు చిత్రసీమకు మరో అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది. ఆమే... తేజస్వి. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', హార్ట్‌ఎటాక్', 'మనం' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది తేజస్వి. ఇప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా 'ఐస్ క్రీమ్'తో హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో నగ్నంగా నటించిందన్న వార్తలతో తేజస్వి మరింత పాపులర్ అయ్యింది. జులై 12న 'ఐస్ క్రీమ్' విడుదల అయ్యింది.
ఇక రిలీజ్ ముందు వరకూ ఆమె చిత్రం గురించి, దర్శకుడు వర్మ గురించి ఓ రేంజిలో చెప్పుకొచ్చింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది అంది. వర్మ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటీనటులకు కావల్సినంత స్వేచ్ఛ ఇస్తారు. ఆయన పరిచయం చేసిన హీరోయిన్స్ అంతా స్టార్స్‌గా ఎదిగారు. వర్మ సినిమాలో నటిస్తే... దాదాపుగా అన్ని భాషల్లోనూ గుర్తింపు సాధించినట్టే. ఈ ఒక్క సినిమాతో ఎంతో నేర్చుకొనే అవకాశం దక్కింది అని చెప్పుకొచ్చింది.

అలాగే ఈ ఐస్ క్రీమ్ సినిమాలో అవకాశం రావటం గురించి చెప్తూ... విష్ణు-వర్మల కలయికలో '12' అనే చిత్రంలో నటిస్తున్నా. అందులో నాది చిన్న పాత్ర. 'ఐస్ క్రీమ్' సినిమాలో నటిస్తావా?? అని ఓ రోజు వర్మ అడిగారు. వెంటనే కళ్లు మూసుకొని ఒప్పేసుకొన్నా. ఎందుకంటే వర్మ సినిమా అంటే అంత క్రేజ్ అంది.
ఈ సినిమాలో నగ్నంగా నటించారన్న వార్తల గురించి చెప్తూ... ఓ సన్నివేశంలో అలా కనిపించాల్సివచ్చింది. ఆ సమయంలో సెట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. నాలుగు చోట్ల కెమెరాలు అమర్చారు. నాకు నేనే యాక్షన్ చెప్పుకొని.. నాకు నేను కట్ చెప్పుకొన్నా. ఆ సీన్‌లో నేను నగ్నంగా కనిపించానా? లేదా? అసలు ఆ సన్నివేశం ఎందుకు చేయాల్సివచ్చింది? అనేవి సస్పెన్స్ అంది.
ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి భయం వేయలేదని అంది. వర్మగారు ఏం చెబితే అది చేయాలి అనిపించింది. చేశానంతే. అయినా అదో ట్రిక్ షాట్ అంతే. ఈ సినిమాలో చాలా విశేషాలున్నాయి. ఫ్లో కామ్ టెక్నాలజీ ఉపయోగించారు. సాంకేతికంగా కొత్త పరికరాలు వాడారు. వాటన్నింటినీ వదిలేసి ఈ సన్నివేశం గురించే మాట్లాడుతున్నారెందుకో నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది.
ఈ చిత్రం కాకుండా చేస్తున్న సినిమాల గురించి చెప్తూ... 'ఐస్ క్రీమ్' కంటే ముందే ఓ సినిమాలో చేశా. ఓంకార్ సోదరుడు ఇందులో కథానాయకుడిగా నటించారు. 'వూర్వశివో రాక్షసివో' అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇదో రోడ్ జర్నీకి సంబంధించిన కథ. నా పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. సినిమా మొత్తమ్మీద ఒక్కసారి కూడా నవ్వను. తమిళంలో ఒక సినిమా చేస్తున్నా అని చెప్పింది.


Click it and Unblock the Notifications











