ప్రగల్పాలు పలికిన 'చిన్నికృష్ణ' ఎక్కడున్నావయ్యా..!?
రాజకీయాల్లో జగన్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎలా మాట్లాడతాడో... సినిమాల్లో అల్లు అరవింద్ ప్రతినిధి చిన్నికృష్ణ కూడా అలాగే మాట్లాడతాడు. ఎగస్ట్రాలు మాట్లాడ్డంలో ఇద్దరికీ చాలా పోలికలున్నాయనిపిస్తుంది. మొన్న బద్రీనాథ్ రిలీజ్ ముందు చిన్నికృష్ణ మరీ అతిశయాలు పోయి రెచ్చిపోయి స్టేస్ట్ మెంట్లు ఇచ్చాడు రైటర్ చిన్నికృష్ణ . ఓ సందర్బంలో రిజల్ట్ తేడాగా ఉంటే తనదే బాధ్యత అని కూడా స్టేట్ మెంట్ విసిరాడు.
నరసింహనాయుడు, ఇంద్ర, పోకిరి, మగధీర సినిమాల తర్వాత 'మళ్లీ అంతటి రికార్డు క్రియేట్ చేసేది బద్రీనాదే', ఈ ఐదు సినిమాలు ఇండస్ట్రీ 'టాప్ ఫైవ్' గా నిలుస్తాయన్న చిన్నిపై. అప్పుడే అందరికీ డౌటొచ్చేసింది..! ఆ ప్రెస్ మీట్ లో వున్న జర్నలిస్టులు కూడా నవ్వుకున్నారు. దాంతో ఈ సినిమా రిజల్ట్ తేడాగా ఉంది కదా..దీని గురించి చిన్నికృష్ణ ఎలా స్పందిస్తాడో తెలుసుకుందామని మీడియా ఇతగాడిని కాంటాక్ట్ చేయడానికి తెగ ట్రై చేస్తోందట. కాని చిన్నికృష్ణకు బద్రినాథ్ షాక్ ఇచ్చిందేమో కానీ జర్నలిస్టులకి ఆయన దొరకడం లేదట....


Click it and Unblock the Notifications











