విష్ణుకి మనోజ్ కాంపిటీటర్ అవుతాడా?
మంచు విష్ణు హీరోగా రూపొందిన 'సలీమ్" ఈ నెల 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'బిందాస్" కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీ తమ్ముడు మీకు కాంపిటీటర్ అవుతాడనుకుంటున్నారా అని విష్ణు దగ్గర అడిగితే - ' మా ఇద్దరి మధ్య పోటీ లేదు. నేను, మనోజ్ మంచి స్నేహితుల్లా ఉంటాం. అంతే కానీ పోటీ పడే మనస్తత్వం మా ఇద్దరికి లేదు. కానీ నటుడిగా నాకంటే మనోజ్ బాగా చేస్తాడనీ నా ఫీలింగ్. సో నటన విషయంలో మా ఇద్దరి మధ్య సోటి ఉంటుంది. ఈ విషయంలో నా కాంపిటీటర్ మనోజ్నే అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











