పవన్ కళ్యాణ్ పంజా పై రూమర్స్ క్రీయేట్ చేస్తున్నదెవరు..?
పవన్ కళ్యాణ్ అభిమానుల మాదిరిగా తమ హీరోని పిచ్చగా అభిమానించే వాళ్లు మరొకరు ఉండరేమో అనేట్టుగా పవర్ స్టార్ అభిమానులు తమ హీరో పట్ల తమకి ఉన్న అభిమానాన్ని పలు విధాలుగా చూపిస్తున్నారు. పంజా సినిమా టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచి రకరకాల కాన్సెప్ట్స్ తో ట్రైయిలర్స్ రూపొందించి విడుదల చేస్తున్నారు. వీరి ఉత్సాహాన్ని చూసి ఇదే లైన్స్ లో పంజా నిర్మాతలు ఓ కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేశారు.
ఇదిలావుంటే ఓ ఫాన్ మేడ్ ట్రైయిలర్ లోని ఓ డైలాగ్ పంజాలోని డైలాగేనంటూ ప్రచారమవుతోంది. 'మామూలుగా దీన్ని పిడికిలి అంటారు..కానీ ఇది పంజా..దీంతో ఒక్కసారి దెబ్బతింటే ఆటోమేటిగ్గా రెండోసారి దెబ్బతినే అవకాశాన్ని కోల్పోతారు.." అనే డైలాగ్ పంజాలోదే అంటూ పలు వెబ్ సైట్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా క్రియేట్ చేస్తున్నది ఎవరు..? ఫిల్మ్ మేకర్స్ వీటిని అఫిషయల్ గా విడుదలచేయేదంటున్నారు.
కానీ నిజానికి ఈ డైలాగ్ చిరంజీవి నటించిన 'రాజా విక్రమార్క" సినిమాలోనిది. పంజా దెబ్బ గురించి ఉండేసరికి అభిమానులు ట్రైయిలర్ లో దీన్ని వాడేయగా, అది తెలియని వాళ్లు ఇది పవర్ ఫుల్ పంజా డైలాగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైల్, లుక్, ఫీల్ అన్ని చూస్తుంటే హాలీవుడ్ మూవీ 'ది పనిషర్" ని తలపిస్తోందని, హాలీవుడ్ మూవీకి బాగా ఇన్స్ పైర్ అయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications










