‘ఊకొడతారా..'లో బాలకృష్ణను ఎవరు డైరక్ట్ చేసారు?

By Srikanya

బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా'. జూలై 27న విడుదల అవుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ఎపిసోడ్స్ ని ఎవరు డైరక్ట్ చేసారు అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ గా నలుగుతున్న చర్చ. చాలా మంది ఈ ఎపిసోడ్స్ ని మంచు మనోజ్ డైరక్ట్ చేసాడని చెప్పుకుంటున్నారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని డైరక్ట్ చేసిన మనోజ్ వీటిని కూడా డైరక్ట్ చేసాడని అంటున్నారు. మంచు మనోజ్ లో దర్శకత్వం టాలెంట్ ఉందని అది ఆ ఎపిసోడ్ లో కనపడనుందని అంటున్నారు. అవి క్లిక్ అయితే తన తదుపరి చిత్రానికి మెగాఫోన్ పట్టుకునే అవకాశం ఉందని వినికిడి.

నిజానికి మొదటి నుంచీ మల్టి ట్యాలెంటెడ్ గా మంచు మనోజ్ తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తున్నారు. తన సినిమాలో ప్రతీ చిన్న విషయం పట్టించుకుంటూ ప్రతీది పర్యవేక్షించే మనోజ్ కి సినిమా అంటే విపరీతమైన ప్రేమే ఈ డైరక్షన్ వైపుగా మరిలించింది అంటున్నారు. ఇక మంచు మనోజ్, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా'. బాలకృష్ణ అతిథి పాత్రలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ మొదట ఆగస్టు 2 అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ని జూలై 27 కు ముందుకు జరిపారు.

ఇక ఇప్పటికే 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మించింది. ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X