ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వెనకున్నది ఎవరు?
గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ గా జరుగుతున్న చర్చ... అస్సలు ఎవ్వరు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కు బ్యాకింగ్ గా ఉండి నడిపిస్తోంది అనేదే. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నిర్మిస్తున్న చిత్రాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ సంక్రాంతికి వారు విడుదల చేసిన బిజినెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. మరో ప్రక్క పూలరంగడు చిత్రం విడుదలకు సిద్దం చేస్తున్నారు. సునీల్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపైనా బాగా ఖర్చుపెట్టారని వినికిడి. వీటి తర్వాత భారీ బడ్జెట్ తో నాగార్జున హీరోగా తెరకెక్కుస్తున్న సోషియో ఫాంటసీ ఢమరకం. శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాదాపు ముప్పై ఐదు కోట్లు వరకూ ఖర్చుపెట్టారని చెప్పుకుంటున్నారు. ఇవి ఇలా ఉండగా మరో ప్రక్క నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో ఆటో నగర్ సూర్య చిత్రం షూటింగ్ జరుగుతోంది.
ఒకేసారి ఇన్ని పెద్ద సినిమాలు నిర్మించటం అంటే మాటలు కాదని,ఎవరో పెద్ద వ్యక్తి ఈ సంస్ధ వెనక ఉన్నాడని అంటున్నారు. వీటికి తోడు వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. బినెనెస్ మ్యాన్ చిత్రాన్ని రెండు వేల ప్రింట్లతో విడుదల చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. అంతేగాక సునీల్ కెరీర్ లో అత్యధిక ప్రింట్లతో అంటే నాలుగు వందల ప్రింట్లతో పూల రంగడు చిత్రం విడుదల చేస్తామని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. ఇక మరోప్రక్క ఆర్.ఆర్.మూవి మేకర్స్ వెంకట్ అస్సలు పూర్తి పేరేమిటి..అస్సలు ఆయన ఎవ్వరు అనే విషయాలు చాలా సీక్రెట్ గా ఉంటున్నాయి. దాంతో జనానికి రకరకాల అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఫామ్ లో ఉన్న ఓ యంగ్ రాజకీయనాయుడుకు వెనక ఉండి ఫైనాన్స్ చేసి నడిపిస్తున్నాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. అస్సలు ఏం జరుగుతోందో తెలియాలంటే వారే వచ్చి ఇదీ జరిగింది అని చెప్తేకానీ అస్సలు విషయం బయిటకు రాదు.


Click it and Unblock the Notifications











