twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యకు కాబోయే చిన్నల్లుడు ఆ ఇద్దరు హీరోల్లోనే..?

    By Bojja Kumar
    |

    నందమూరి నటసింహం బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి వివాహం తన బావ చంద్రబాబు కుమారుడు లోకేష్‌తో జరిగిన విషయం తెలిసిందే. బాలయ్య రెండో కూతురు నందమూరి తేజస్వినికి త్వరలో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య కుటుంబ సభ్యులు. నందమూరి కుటుంబ సన్నిహితుల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం బాలయ్య మెహన్ బాబు కుటుంబంతో గానీ, రామానాయుడు కుటుంబంతోగానీ వియ్యమొందాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు తనయుడు మనోజ్, రామానాయుడు మనవడు రాణా పట్ల బాలయ్య సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు సురేష్ బాబు కూడా బాలయ్యతో వియ్యమొందడానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

    ప్రస్తుతం బాలయ్య శ్రీమన్నారాయణ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో 'మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి ఆగస్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు 'శ్రీమన్నారాయణ'లో ఉంటాయి.

    బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

    English summary
    It is heard that speculations have begun regarding another marriage. Nandamuri Tejaswini, the second daughter of Balayya in between, gossips came that it will be with Manchu Manoj but that fizzled out quickly. And now it is heard that Daggubati Suresh Babu is trying for an association with the Nandamuri family for his son Rana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X