రామ్ చరణ్ ని కాకపోతే బాలకృష్ణ టార్గెట్ ఎవరు?

By Srikanya

నా వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశానో వారికి తెలుసు. ఈ వ్యాఖ్యలు రామ్‌చరణ్‌ను ఉద్దేశించినవి కావు. రామ్‌ చరణ్‌ ని నేను కలిసి నాలుగైదు నెలలు అవుతోంది. ఆ వ్యాఖ్యలు రామ్‌చరణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా ప్రచారం చేయడం శోచనీయం అంటూ బాలకృష్ణ నిన్న(గురువారం) మీడియాకు తెలియచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కాదని తేల్చేయటంతో ఇంతకీ బాలకృష్ణ ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆ మాటలు.. ఏ హీరోని అన్నారనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన హీరోని ఉద్దేశించి అన్నాడా లేక ఏ నిర్మాత అయినా అన్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నానో వారికి తెలుసు అంటే.. వారు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉండిపోయారా అనేది ఫిల్మ్ నగర్ వాసుల మరో ఆలోచన. అయితే ఇప్పుడు అంతా మీడియాని తప్పుపడుతున్నారు. బాలకృష్ణ అన్న విషయాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా దానికి చిలువలు పలవలు అద్ది విషయాన్ని పెద్దది చేసారని అంటున్నారు.

అలాగే 'శ్రీరామ రాజ్యం" ఆడియో అభినందన సభలో నేను అన్న మాటలను వక్రీకరించారు. ఎవరినీ కించపర్చడం నా నైజం కాదు అనే విషయాలను కూడా నిజమే అంటున్నారు. గతంలో ఎప్పుడూ కూడా బాలకృష్ణ ఎవరిని కామెంట్ చేయలేదనే విషయాన్ని గుర్తిస్తున్నారు. అంతేగాక.. తమిళ, కన్నడ, హిందీ సినిమాలను నాకు చూపించిన నిర్మాతలకు నేనెప్పుడూ చెబుతుంటాను.... ఆ సినిమాలు నాకు పనికిరావు, మన నేటివిటీకి సరిపోవు... ఆ సినిమాలు ఒక డెరైక్టరే తీస్తారు, ఒక హీరోనే యాక్ట్ చేయగలుగుతాడు... ఒకసారే తీయబడుతుందని. లక్షలు పెట్టి నెగిటివ్ రైట్లు కొన్న నిర్మాతలకు సలహా కూడా ఇస్తాను. కావాలంటే ఆ సినిమా డబ్ చేయండి అంటూ బాలయ్య చెప్పిన విషయాన్ని కంటిన్యూగా రీమేక్ సినిమాలు చేస్తున్న హీరోలు కూడా గుర్తించుకోవాలి అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X