'గుండమ్మ కథ'రీమేక్ దర్సకుడు?
రీసెంట్ గా ఇంటర్వూల్లో నాగచైతన్య మరోసారి గుండమ్మ కధ రీమేక్ విషయం ప్రస్తావించిన సంగతి తెలిసిందే.దాంతో మరో సారి ఈ వార్తను అనుసరిస్తూ మరిన్ని వార్తలు వినపడుతున్నాయి.ఇప్పుడు ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నాడంటూ వినపడుతోంది.అశ్వనీదత్ నిర్మించే ఈ చిత్రంలో గుండమ్మగా వాణిశ్రీని సెలెక్టు చేస్తే బావుంటుందని భావిస్తున్నారని చెప్తున్నారు.ఇక గుండమ్మ పాత్ర ఫైనల్ అయితే ఎన్టీఆర్ కూడా డేట్స్ కేటాయించటానికి రెడీగా ఉన్నాడు.
అయితే ఈ పాత్రలను ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్, ఎఎన్నార్ మనమడు నాగచైతన్య చేస్తామని ముందుకు వచ్చారు . ఇద్దరి పాత్రలు ఓకే. కానీ చిత్రంలో నటించడానికి గుండమ్మగా ఎవరు, ఎస్వీరంగారావు ధరించిన పాత్ర, రమణారెడ్డి పోషించిన గంటన్న పాత్రలు ఎవరు చేస్తారన్న చర్చ సహజంగానే జరుగుతోంది. ఈ కాలానికి తగినట్లు మార్పులతో కాజల్,తాప్సీ హీరోయిన్స్ గా ఈ పాజెక్టుని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు.ఇక కొందరు సినిమా వీరాభిమానులు మాత్రం ఈ సినిమా రీమేక్ ఆలోచన వదిలేస్తే మంచిదని సూచిస్తున్నారు.ఇంతకీ ఈ చిత్రం తెరకు ఎప్పుడు ఎక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











