ఇలియానా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ ఇలియానా సీక్రెట్‌గా బాయ్ ఫ్రెండ్‌ను మెయింటేన్ చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో బట్టబయలైంది. అతని పేరు ఆండ్రూ. ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్. ఇలియానా-ఆండ్రూ మధ్య సంవత్సర కాలం నుంచి పరిచయం ఉందని, వాళ్ల క్లోజ్ నెస్ చూస్తుంటే కేవలం స్నేహం మాత్రమే కాదని....అంతకు మించిన అనుబంధం వారి మధ్య ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంవత్సర కాలం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిందని, ఇరువురు ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.

ప్రస్తుతం ఇలియానా పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. Phata Poster Nikhla Hero అనే సినిమా షూటింగులో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లిన ఇల్లీ బేబీ సమయం దొరికినప్పుడల్లా అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ను మీట్ అవుతూ తెగ ఎంజాయ్ చేస్తోందని టాక్.

అయితే ఇలియానా మదర్ సమీరా మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని, వారు కేవలం స్నేహితులు మాత్రమే అని అంటోంది. ఇలియానా తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టిందని, ప్రస్తుతం మూడుకుపైగా హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోందని, ప్రేమించడానికి సమయం ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తోంది. అనవసరంగా వారి మధ్య లేనిపోని సంబంధాలు అంటగట్టవద్దని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్చూలో పేర్కొంది.

More from Filmibeat

Read more about: ileana ఇలియానా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X