మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్ లలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఎవరు..!?
'ఆర్య-2" లోని 'మిస్టర్ పర్ ఫెక్ట్" సాంగ్ బాగా పాపులర్ అవగానే అదే టైటిల్ గా పెట్టేసుకుని మహేష్ ఒక సబ్జెక్ట్ చెప్పాడు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బేనర్ లో మహేష్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఆ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" సినిమా వుంటుందంటూ అధికారిక వార్తలు కూడా వెలువడ్డాయి అయితే ఎప్పుడే ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఊహించని పరిణామాలు సంభవించాయి.
ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బేనర్ లో మహేష్ చెయ్యనున్న చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్ గా ఎంపిక కాగా, సురేందర్ రెడ్డి వెళ్ళి జూ ఎన్టీఆర్ తో నల్లమలుపు బుజ్జి సినిమా చేస్తున్నారు. ఇక ఆ సినిమా కోసం అనుకున్న 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" టైటిల్ నేమో ప్రభాస్-దశరథ్-దిల్ రాజుల సినిమాకి పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయిప్పుడు. సో..మహేష్ కాదు, ప్రభాసే 'మిస్టర్ పర్ ఫెక్ట్" అనే న్యూస్ ని మీరు త్వరలోనే వినాల్సి రావచ్చు.


Click it and Unblock the Notifications











