»   » బన్నీ సినిమాలో...నిత్యామీనన్ సరసన ఆ కుర్రాడా

బన్నీ సినిమాలో...నిత్యామీనన్ సరసన ఆ కుర్రాడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిత్యామీనన్ కొత్తగా పెళ్లైన అమ్మాయిగా కనిపించనుందని సమాచారం. ఈమెకు భర్తగా చైతన్య కృష్ణ కనిపించనున్నారు. చైతన్య కృష్ణ గుర్తున్నాడా...గతంలో వెన్నెల వన్ అండ్ హాఫ్, నిన్ను కలిసాక, అది నువ్వే, కాళీ చరణ్ వంటి చిత్రాలు చేసారు. అయితే బ్రేక్ రాలేదు. ఇప్పుడు పెద్ద హీరో, పెద్ద డైరక్టర్ కావటంతో నిత్యామీనన్ కు భర్తగా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ కథానాయికలు. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

Who Is Nitya's Husband In Bunny's Movie?

త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary
Nitya Menon is playing the role of a newly married girl in Bunny's latest titled 'S/o Satyamurthy'.And none other than Chaitanya Krishna is playing the role of her husband.
Please Wait while comments are loading...