‘గబ్బర్ సింగ్’ నెం.1 అని చెర్రీ ఒప్పుకుంటాడా?

అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన దూకుడు, బిజినెస్ మేన్ చిత్రాలు 'మగధీర' రికార్డు దగ్గరి వరకు వచ్చి కొద్ది పాటిలో నెం.1 స్థానాన్ని మిస్సయ్యాయి. ఆ మధ్య మెగా అభిమానులు ఇతర హీరోల అభిమానుల మధ్య కలెక్షన్ల విషయంలో ప్లెక్సీల వార్ కూడా జరిగింది. తమ చిత్రమే నెం.1 అంటూ మెగా కుటుంబానికి చెందిన అల్లు శిరీష్ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు.
మరి ఇప్పుడు మెగా చిత్రానికి మెగా చిత్రమే పోటీగా వచ్చింది. మరి గబ్బర్ సింగ్ చిత్రం నెం.1 అని రామ్ చరణ్, ఇతర మెగా కుటుంబ ఒప్పుకుంటారా? అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. ఏది ఏమైనా ఈ మెగా రికార్డు మళ్లీ మెగా ఫ్యామిలీకే దక్కండంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పవర్ సరసన శృతి హాసన్ నటించగా....బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చిత్రానికి మరింత ప్లస్సయింది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విజయయాత్ర ఎన్ని రోజుల వరకు సాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











