కల్కిలో ప్రభాస్ హీరో కాదా?.. అయితే హీరో ఎవరంటే?

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి. మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ ట్రైలర్ అంటూ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఈ ట్రైలర్ చూశాక సినిమాలో హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి ప్రభాస్ హీరో కాదా? ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. స్టార్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. నాలుగు రోజుల్లోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను స్పెషల్ గా ముంబైలో నిర్వహించారు. మరోవైపు ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా రూపొందించిన బుజ్జి దేశవ్యాప్తంగా నగరాల్లో హల్చల్ చేస్తోంది.

who is the main hero in the Kalki 2898 AD Movie Is Prabhas or Amitabh Bachchan or Kamal Haasan

ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ అంటే రెండవ ట్రైలర్ ను జూన్ 21న రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రైలర్ లో సినిమాపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సెకండ్ ట్రైలర్ లో సినిమా ఎలా ఉంటుందో, స్టోరీ ఏంటి అనే విషయాలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు. ట్రైలర్ ను కరెక్ట్ గా గమనిస్తే హీరో కంటే అమితాబ్ పాత్ర ఎక్కువ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.

అశ్వద్ధామ గా నటించిన అమితాబ్ బచ్చన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్టుగా అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరో ప్రభాస్. ఆయన భైరవ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. కల్కి మూవీలో ఆయన పాత్ర బౌంటీ హంటర్. అంటే తప్పిపోయిన వారిని వెతికి పట్టుకునే వారినే బౌంటీ హంటర్ అని అంటారు. ట్రైలర్ లో భైరవ దీపికాని వెతుక్కుంటూ వస్తున్నట్లుగా కనిపించింది.

who is the main hero in the Kalki 2898 AD Movie Is Prabhas or Amitabh Bachchan or Kamal Haasan

కానీ అశ్వద్ధామ దీపికను కాపాడుతున్నాడు. దీంతో ట్రైలర్ ను బట్టి చూస్తే ప్రభాస్ హీరోగా కనిపించట్లేదు. నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి, సెకండ్ హాఫ్ లో పాజిటివ్ గా మారతాడు అనే టాక్ మొదలైంది. సినిమా మొదటి భాగం అంతా ఏదో సైడ్ క్యారెక్టర్ లా ఉండే ప్రభాస్ సెకండ్ పార్ట్ లో మాత్రం హీరోగా మారతాడని అంటున్నారు.

ముందుగా దీపికాను పట్టుకోవడానికి అమితాబ్ తో ఫైట్ చేసే భైరవ, ఆ తర్వాత అశ్వద్ధామ దగ్గర జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత విలన్ కు వ్యతిరేకంగా పోరాడి దీపికను సేవ్ చేస్తాడని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని, అందులో ఒకటి భైరవ పాత్ర అని, మరొకటి కల్కి పాత్ర అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X