GunturKaaram: కుర్చి మడత పెట్టి సాంగ్.. పూర్ణ స్పెషల్ పాటను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే?

సంక్రాంతి బరిలోకి మహేశ్ బాబు సినిమా వచ్చి సందడి చేస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రం ఎలా ఉన్నా గానీ.. ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాను కుర్చి మడతపెట్టి సాంగ్ ఓ ఊపు ఊపేస్తుంది. ఈ సినిమాలోని ఈ పాటను ఓ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే స్పందన ఎలా ఉన్నా... ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఇక మహేశ్ ఫ్యాన్సుకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. ఈ పండక్కి వారికి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.

Who is the star heroine who missed the Kurchi Madathapetti song in GunturKaaram Movie?

మదర్ సెంటిమెంటుతో వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్.. మహేశ్ కు జోడీగా శ్రీలీల నటించింది. ఇక మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఈశ్వరరావు పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కుర్చి మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన ఈ పాటే దుమ్మురేపుతుంది. అయితే ఈ సినిమాలోని ఈ పాటలో హీరోయిన్ పూర్ణ కనిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పాటలో ముందుగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో చేయించాలని అనుకున్నారట త్రివిక్రమ్. కానీ కాజల్ అగర్వాల్ ఆ పాత్రను రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఆల్రెడీ మహేష్ బాబుతో హీరోయిన్ గా చేసి ఇప్పుడు ఆయన సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఆమె మనసు అంగీకరించలేదని సమాచారం. అందుకే ఈ సినిమా ఆఫర్ ను వదులుకునిందని నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ పాటను కాజల్ మిస్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి.

Who is the star heroine who missed the Kurchi Madathapetti song in GunturKaaram Movie?

ఇక ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ఓ తాత డైలాగ్ ను ఈ పాటలో వాడారు తమన్. ఇక తమన్ అందించిన స్వరాలు... శ్రీలీల, మహేష్, పూర్ణ డ్యాన్స్ నెక్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలోని ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X