ప్రియుడితో అలా పట్టుబడ్డ ఖుషీ కపూర్.. శ్రీదేవీ చిన్నకూతురు బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

శ్రీదేవీ కూతుళ్లు జాన్వీ కపూర్, కుషీ కపూర్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ఇక వారి డేటింగ్, అఫైర్ వార్తల విషయానికి వస్తే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే జాన్వీ కపూర్ డేటింగ్ వ్యవహారం మీడియాలో సెన్సేషన్‌కుగా మారితే.. తాజాగా ఆ జాబితాలో ఖుషీ కపూర్ చేరారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇటీవల మీడియాలో చిక్కడం వైరల్‌గా మారింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ కొన్నేళ్లుగా శిఖర్ పహారియా అనే ముంబై రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడితో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అతడితో కలిసి ఆమె తిరుపతిలోని బాలాజీని పలుమార్లు దర్శించుకోవడం మీడియాలో హాట్ టాపికైంది. వారిద్దరూ పీకల్లోతుప్రేమలో ఉన్నారనే విషయం బాలీవుడ్ మీడియా పలు కథనాలు వెల్లడించాయి.

Who is Vedang Raina Is Khushi Kapoor confirmed relation with Archies Actor

ఇక ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆర్చీస్ అనే సిరీస్‌తో నటిగా ప్రవేశం చేసింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించడానికి ముందుకు వచ్చిన సందర్బాలు లేవు. అయినుతే తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

ఇక ఆర్చీస్ సినిమా సమయంలో అందులో నటించిన వేదాంగ్ రైనాతో పరిచయం స్నేహంగాను.. ఆ తర్వాత వారిద్దరి బంధం ప్రేమగాను మారిందనే బాలీవుడ్ మీడియా కథనం. అయితే అందుకు తగిన్టే వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం కూడా అందుకు బలంగా మారింది. వారి రిలేషన్ గురించి వస్తున్న వార్తలు పట్టించుకోకుండా తమ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించిన ఖుషీ మొబైల్ ఫోన్‌లో వాల్ పేపర్‌పై ఖుషి, వేదాంగ్, జాన్వీ, శిఖర్ ఫోటోలు ఉండటంతో వారిద్దరి రిలేషన్ కన్ఫార్మ్ అయింది.

Who is Vedang Raina Is Khushi Kapoor confirmed relation with Archies Actor

అయితే తాజాగా ఖుషి, వేదాంగ్ ఇద్దరు వెకేషన్‌ కోసం ప్రైవేట్ ట్రిప్ ప్లాన్ చేసుకొన్నారు. వారిద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో ఒకే సమయంలో కనిపించడం మీడియా కంటపడింది. దాంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారంపై మరోసారి చర్చ జరిగింది. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి మాత్రం పెదవి విప్పక పోవడంతో రూమర్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి

వేదాంగ్ రైనా విషయానికి వస్తే.. ఇటీవలనే బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.ఆర్చిస్ సిరీస్‌లో ఖుషి కపూర్‌తో కలిసి నటించాడు. తాజాగా ఈ కుర్రాడు ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించే జిగర్ అనే సినిమాలో అలియాభట్‌తో కలిసి నటిస్తున్నాడు. ఖుషి కపూర్‌తో డేటింగ్ వ్యవహారంతొ మరింత పాపులారిటీ సంపాదించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X