జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతిల హనీమూన్ స్పాన్సర్స్ ఎవరంటే..?
వైభవంగా పెళ్లి చేసుకొని ఘనంగా భార్య లక్ష్మీప్రణతిని ఇంటికి తెచ్చేసుకున్న జూ ఎన్టీఆర్ ప్రస్తుతం హనీమూన్ లో వున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ 'మహానాడు" సంబరాలు మొదలయ్యాయి. పార్టీ భవిష్యత్తు దిశానిర్ధేశకులుగా నారాలోకేష్, జూ ఎన్టీయార్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు 'మహానాడు" మహా వేదికగా మారింది. నారా లోకేష్ రాజకీయ ఆరంగెట్రానికి ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోవాలని చూస్తున్నారు నారా అనుచరులు.
ఇదే వేదిక మీద జూ ఎన్టీఆర్ కూడా వుంటే లోకేష్ కు తిప్పలు తప్పవు. అందుకే అదను చూసి ఎన్టీఆర్ ను తప్పించేందుకు చంద్రబాబు నాయుడు తెలివిగా జూ ఎన్టీఆర్ కి టికెట్లు స్పాన్సర్ చేసాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా మావయ్య నాయుడు కుదిర్చిన సంబంధమే కనుక కిమ్మనకుండా ప్లైట్ ఎక్కేసాడట జూ ఎన్టీఆర్..అంతే కాకుండా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి హరికృష్ణ మాత్రమే 'మహానాడు"కు హాజరైనట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











