»   »  షాకింగ్: ఆ హీరోయిన్ బ్రా, ప్యాంటీ ఎవరో దొంగిలించారు?

షాకింగ్: ఆ హీరోయిన్ బ్రా, ప్యాంటీ ఎవరో దొంగిలించారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్...జిస్మ్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఏక్తాకపూర్ నిర్మిస్తున్న 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగులో ఆమెకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె వాడే విక్టోరీయా సిక్ర్రెట్ బ్రాండ్ లింగరీ (బ్రా, ప్యాంటీ) ఎవరో దొంగిలించారు.

'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రంలో సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ సీన్లతో ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. ఇటీవల సినిమా షూటింగులో భాగంగా ఆమెకోసం ఖరీదైన విక్టోరియా సీక్రెట్ బ్రాండ్ లింగరీ తెప్పించారు. వాటిని ధరించి ఆమె కొన్ని సీన్లలో కూడా నటించింది. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత వాటిని విప్పేసి పక్కన పెట్టి...తన పర్సనల్ లింగరీ వేసుకుని వెళ్లి పోయింది.

Sunny Leone

ఈ బ్రాండెడ్ లింగరీని సన్నీ లియోన్ కోసం విదేశాల నుంచి తన అందాల సైజులకు సరిపడే విధంగా ప్రత్యేకంగా ఆర్డర్ పై తెప్పించారు. ఈ స్పెషల్ డిజైన్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ లింగరీ ధర రూ. 50 వేలు ఉంటుందట. మరో రోజు షూటింగ్ సందర్భంగా మళ్లీ అదే కలర్ లింగరీతో షూటింగు జరుపాల్సి ఉండగా...అవి కనిపించలేదు. యూనిట్ సభ్యులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో సేమ్ కలర్ లింగరీని మళ్లీ తెప్పించారట.

కనపడకుండా పోయిన సన్నీ లియోన్ లింగరీ ఏమైందనే విషయం సర్వత్రా చర్చనీయాంశం అయింది. యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు దాన్ని దొంగిలించి ఉంటారని భావిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఎఎల్‌టి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Sunny Leone, who is presently shooting for Ekta Kapoor's film Ragini MMS 2 was in for a rude shock when she found that somebody had stolen her expensive Victoria's Secret lingerie!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu