రజనీకాంత్ 2.0... తెలుగు వెర్షన్ మీద వీడని అయోమయం? ఎవరి చేతికి?
సూపర్ స్టార్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. వాస్తవానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా పలుకారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ సర్దుకోవడంతో ఈ ఏడాది నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Recommended Video

ఇండియాలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటికంటే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ (దాదాపు రూ. 450 కోట్లు) ఇదే. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. గతంలో ఇదే కరణ్ జోహార్ బాహుబలిని బాలీవుడ్లో భారీగా ప్రమోట్ చేయడం ద్వారా ఆ మూవీ భారీ విజయం అందుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు.
ఇక '2.0' మూవీ తెలుగు వెర్షన్ విషయానికొస్తే.... ఈ చిత్రాన్ని ఇక్కడ ఎవరు విడుదల చేస్తారు? అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. '2.0' మూవీ తెలుగు రైట్స్ ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ రూ. 90 కోట్లు కొనుగోలు చేశారు. గతేడాది ఈ డీల్ జరిగింది.

అయితే సినిమా అనుకున్న సమయానికి విడుదల కాక పోవడంతో ఈ డీల్ నుండి ఏషియన్ ఫిల్మ్స్ తప్పుకున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌లో దాదాపు సగం ఇప్పటికే వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.
మరి '2.0' చిత్రాన్ని తెలుగులో ఎవరు విడుదల చేస్తున్నారు? అనేది సందేహంగా మారింది. ఇంత భారీ మొత్తం పెట్టి సినిమాను కొనుగోలు చేయడానికి లోకల్ ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రావడం లేదట. వచ్చే నెలలో సినిమా విడుదల ఉండటంతో ఈ మూవీ రైట్స్ ఎవరు తీసుకుంటారనే విషయమై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


Click it and Unblock the Notifications











