»   » మనోజ్ మోజు పడ్డాడనే సన్నిలియోన్ కి అంత ఖర్చు

మనోజ్ మోజు పడ్డాడనే సన్నిలియోన్ కి అంత ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సన్నీలియోన్‌ సెగ తెలుగు చిత్రసీమకు తగలబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో తళుక్కున మెరవబోతోంది. మంచు మనోజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కరెంటు తీగ'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తారు. లగడపాటి శ్రీధర్‌ నిర్మాత. ఈ చిత్రంలో సన్నీలియోన్‌ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతోంది. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ఖరారు చేసారు. అయితే ఆమెకు రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనే చర్చ అంతటా మొదలైంది.

ఇప్పటికే దర్శక,నిర్మాతలు సన్నీని సంప్రదించి, కాల్షీట్లు సంపాదించారట. ఈ చిత్రం కోసం సన్నీకి ఆకర్షణీయమైన పారితోషికం కూడా ఇచ్చినట్టు సమాచారం. ఆ ఆకర్షయనీయమైన పారితోషికం..పాతిక లక్షలు అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.

Whopping remuneration for Sunny Leone for Current Teega

మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.

''మనోజ్‌ ఎనర్జీని మరో స్థాయిలో చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉంటాయి'' అని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే 'కరెంటు తీగ'కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

English summary
Sunny Leone is going to be seen in Manchu Manoj's latest movie "Current Teega". For this role she has demanded a whopping total of Rs.25 lakhs which is far more for such kind of cameo roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu